Surrender | మావోయిస్టు రహిత లక్ష్యంగా కొనసాగిన చర్యలు

Surrender | మావోయిస్టు రహిత లక్ష్యంగా కొనసాగిన చర్యలు

Surrender | గడువు పెంచుతారా? మావోయిస్టుల ఆలోచన ఏంటి?
గణపతి లొంగుబాటు- ఎప్పుడు?
మిగిలిన వారు లొంగుబాటుకు వస్తారా? అజ్ఞాత పోరాటం కొనసాగిస్తారా?
ఆయన లొంగుబాటుతోనే ఎండ్‌కార్డ్ పడనుందా?

Surrender | హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాటు- ప్రక్రియకు ప్రభుత్వం నిర్ణయించిన గడువు ముగియడానికి ఇంకా పదిరోజులు మాత్రమే మిగిలి ఉండటంతో, రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగుబాటు చెందగా, మిగిలిన వారిపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ఆసక్తి పెరుగుతోంది. గడువు ముగిసే సమయం దగ్గరపడుతున్న కొద్దీ… ఇంకా గడువు పెంచుతారా? అనే ప్రశ్న అందరిలో నానుతున్నది. భద్రతా నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రస్తుత పరిస్థితుల్లో గడువు పొడిగిస్తే మరింత మంది లొంగుబాటుకు ముందుకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు, కఠిన చర్యలుతో ముందుకు వెళ్లాలనే వాదన కూడా వినిపిస్తోంది. మావోయిస్టులలో అంతర్గతంగా కూడా చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం.

కొంతమంది నేతలు లొంగుబాటే సరైన మార్గం అని భావిస్తుండగా, మరికొందరు అజ్ఞాత పోరాటంను కొనసాగించాలని నిర్ణయించుకునే అవకాశముంది. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో ఉన్న కేడర్‌ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. ఇక మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటు- అంశం అత్యంత కీలకంగా మారింది. ఆయన ఎప్పుడు లొంగిపోతారు? ఎందుకు ఆలస్యం అవుతోంది? అనే ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. గణపతి లొంగుబాటు- జరిగితే, అది మావోయిస్టు ఉద్యమానికి ‘ఎండ్‌కార్డ్‘ అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గణపతి తర్వాతి స్థానంలో ఉన్న దేవ్‌ జీ ఇప్పటికే లొంగిపోవడం, మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గణపతి నిర్ణయం ఉద్యమ భవిష్యత్తును నిర్ణయించే అంశంగా మారింది.

Surrender

మొత్తంగా చూస్తే, వచ్చే పదిరోజులు తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి కీలక మలుపు తిప్పే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, మావోయిస్టుల స్పందన ఈ రెండూ కలిసి భవిష్యత్‌ దిశను నిర్దేశించనున్నాయి. ప్రస్తుతం తెలంగాణ నుండి మొత్తం ఏడుగురుమాత్రమే అడవుల్లో ఉండి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కమిటీ-లో ఒక్కరు మాత్రమే ఏసీఎమ్‌ కేడర్‌లో ఉన్నట్లు సమాచారం. మిగిలిన కేడర్లు అందరూ ఛత్తీస్‌ గఢ్‌ సహా ఇతర రాష్ట్రాలలో పనిచేస్తున్నారు. ముగ్గురు కేంద్ర కమిటీ- సభ్యులలో ఇద్దరు తెలంగాణకు చెందినవారు ఉన్నట్లు పోలీసు వర్గాల ద్వారా సమాచారం.

Surrender | గణపతి లొంగుబాటులో- ఆలస్యం ఎందుకు?

70ఏళ్లు పైబడిన వయస్సు, తీవ్రమైన అనారోగ్యం కారణాలతోనే గణపతి చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అనారోగ్య కారణాలతోనే లొంగుబాటు- ఆలస్యం అవుతుందా? లేక గణపతి షరతులుపై మంతనాలు జరుగుతున్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లొంగుబాటు- తర్వాత భద్రత, కేసుల మాఫీపై తెరవెనుక చర్చలు జరుగుతున్నాయా? మిగిలిన వారి పరిస్థితి ఏమిటి? ఆయనతో పాటు మరికొందరు అగ్రనేతలు బయటకు వస్తారా? లేక అజ్ఞాత పోరాటంను కొనసాగిస్తారా? ఇలా అనేక ప్రశ్నలు అందరినీ కలవర పెడుతున్నాయి. గణపతి లొంగుబాటు- జరిగితే, అది కేవలం ఒక వ్యక్తి లొంగుబాటు- కాదు.. ఒక సిద్ధాంత పోరాటం ముగింపునకు సంకేతంగా చెప్పుకోవచ్చు. ఆయన బయటకు రావడంతో సుదీర్ఘ కాల నిషేధిత మావోయిస్టు పార్టీ కార్యకలాపాలకు ముగింపు పలుకుతారని అంతా భావిస్తున్నారు.

Surrender

Surrender | మావో జెండాకు ఎండ్‌కార్డ్‌ పడనుందా?

దట్టమైన అడవుల్లో తుపాకీ గర్జనలు ఆగిపోతాయా? దశాబ్దాల సాయుధ పోరాటంకు తెరపడబోతోందా? ఇప్పుడు ఇదే ప్రశ్న అటు నిఘా వర్గాలను, ఇటు రాజకీయ వర్గాలను తొలిచేస్తోంది. మావోయిస్టు పార్టీ అగ్రనేత, మాజీ ప్రధాన కార్యదర్శి గణపతి (ముప్పాళ్ల లక్ష్మణరావు) లొంగుబాటు-కు సంబంధించి గడువు సమీపిస్తోంది. కగార్‌ ఆపరేషన్‌ డెడ్‌లైన్కు కేవలం పది రోజులే మిగిలి ఉండటంతో.. అడవిలో ఏం జరగబోతోంది? అనే ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ఇప్పటికే మావో అగ్రనేత దేవ్‌ జీ నిష్క్రమణతో పార్టీకి కోలుకోలేని దెబ్బ తగలగా.. ఇప్పుడు గణపతి కూడా అదే బాటలో నడిస్తే, అజ్ఞాత పోరాటానికి ఎండ్‌కార్డ్ పడేలా కనిపిస్తోంది. ఏదేమైనా మావోయిస్టుల భవితవ్యం తేలాలంటే మార్చి 31 వరకు వేచి చూడాల్సిందేనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Surrender

Leave a Reply