Union Minister |తేనెటీగల దాడిలో పలువురికి గాయాలు

Union Minister | తేనెటీగల దాడిలో పలువురికి గాయాలు

Union Minister | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అంజన్న ఆశీర్వాద పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్రలో ఓ అనుకోని సంఘటన చోటుచేసుకుంది. రామడుగు మండలం కోనరావుపేట ప్రాంతంలో యాత్ర సాగుతుండగా డ్రోన్‌ కెమెరా ద్వారా ఫుటేజ్‌ తీసేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు.

ఈక్రమంలో చెట్టుకు ఉన్న తేనెతుట్టకు డ్రోన్‌ తగిలింది. దీంతో ఒక్కసారిగా తేనెటీగలు పైకి లేచి దాడి చేశాయి. వెంటనే బండి సంజయ్‌, ఆయన సిబ్బంది అప్రమత్తమయ్యారు. తేనెటీగల దాడితో యాత్రలో పాల్గొన్న కార్యకర్తలు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. తేనెటీగల దాడిలో నలుగురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో పాదయాత్రకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడినా… అనంతరం తిరిగి మొదలైంది.

Leave a Reply