మున్సిపాలిటీకి రూ.63 కోట్ల బడ్జెట్‌కు గ్రీన్ సిగ్నల్

మున్సిపాలిటీకి రూ.63 కోట్ల బడ్జెట్‌కు గ్రీన్ సిగ్నల్
మార్కెట్, పార్క్ ఏర్పాటుకు భూములు లీజుకు తీసుకునే ప్రతి పాదనకు ఆమోదం.
బడ్జెట్ సమావేశంలో అభివృద్ధి పనులపై విస్తృత చర్చ
నిధుల వినియోగంపై ప్రశ్నలు లేవనెత్తిన బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు
పేదలపై అధిక పన్ను భారం పడకూడదు.
పన్నుల వసూళ్లపై అధికారులు, కౌన్సిలర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి
మున్సిపల్ సిబ్బంది జీతాలపై ఎమ్మెల్యే కడియం ఆరా
స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో శుక్ర వారం మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ అధ్యక్షతన నిర్వ హించిన మున్సిపాలిటీ 2026–27 బడ్జెట్ సమావేశానికి మాజీ ఉప ముఖ్య మంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యా రు. ఈ సందర్భంగా 2026–27 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనాల ప్రతిపాదనలను పరిశీలించి వాటిపై చర్చించారు. మొత్తం రూ.63 కోట్ల 33 లక్షల 70 వేల బడ్జెట్ అంచనాలకు మున్సిపాలిటీ పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అలాగే పట్టణ కేంద్రంలో మార్కెట్ ఏర్పాటు కోసం బస్టాండ్ సమీపంలోని శ్రీ తిరుమలనాథ ఆల య భూమిని లీజు కు తీసుకునేందుకు, పట్టణ కేంద్రంలో పార్క్ అభివృ ద్ధి చేసి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడానికి వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్న సుమారు నాలుగు ఎకరాల భూమిని లీజుకు తీసుకునే తీర్మానాలను చేసి ప్రభుత్వానికి పంపేందుకు పాలకవర్గం ఆమోదం తెలిపింది.
పేద ప్రజలపై అధిక భారం పడకుండా చూడాలి: ఎమ్మెల్యే కడియం
జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలలో పన్నుల వసూళ్లు ఎలా అమలు చేస్తున్నారో పరిశీలించాలి. సామాన్య, పేద ప్రజలపై అధిక భారం పడ కుండా చూడాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. ముందుగా వాణిజ్య, వ్యాపార పన్నులను సమర్థంగా వసూలు చేసేందుకు అధికా రులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పన్నులు వసూలు అయి తేనే ఉద్యోగులు, కార్మికులకు జీతాలు చెల్లించడం, అభివృద్ధి పనులు చేయడం సాధ్యమవుతుందని చెప్పారు. అందువల్ల పన్నుల వసూళ్లపై అధికారులు, కౌన్సిలర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మొత్తం గా వంద శాతం పన్నులు వసూలు అయ్యేలా అధికారులు, కౌన్సిలర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు.
నిధుల వినియోగంపై ప్రశ్నలు లేవనెత్తిన బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు:
బడ్జెట్ సమావేశంలో భాగంగా బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు పలు అభివృద్ధి పనులు, నిధుల వినియోగంపై ప్రశ్నలు లేవనెత్తారు.మొదటగా మున్సి పాలిటీకి వచ్చిన రూ.50 కోట్ల నిధుల్లో ఇప్పటివరకు ఎక్కడెక్కడ టెండ ర్లు పిలిచారు, ఎంత మొత్తానికి పనులు మంజూరయ్యాయి. ఎంత వరకు పనులు పూర్తి అయ్యాయనే వివరాలను వెల్లడించాలని బీఆర్ ఎస్ కౌన్సిలర్లు ఎమ్మెల్యేను కోరారు. ఇందులో రూ.24 కోట్లకు టెండర్లు పిలిచినట్లు చెప్పారు. అవి ఏఏ వార్డుల్లో జరిగాయి. ఎంత మొత్తానికి పనులు ప్రారంభమయ్యాయనే వివరాలను కూడా వెల్లడించాలని కోరా రు. మిగిలిన రూ.26 కోట్ల నిధులను ఏ వార్డులకు కేటాయిస్తారు. ఎక్క డ అభివృద్ధి పనులు చేపడతారనే విషయంపై కూడా స్పష్టత ఇవ్వాలని పలువురు బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు ప్రశ్నించారు. వెంటనే ఏఈ ద్వారా ఎక్క డ ఎక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయో వివరాలు వారికి తెలి యజేయాలని ఎమ్మెల్యే సూచించారు.
మున్సిపల్ సిబ్బంది జీతాలపై ఎమ్మెల్యే కడియం ఆరా:
బడ్జెట్ సమావేశంలో మున్సిపల్ సిబ్బంది జీతాల అంశం కూడా ప్రధాన చర్చకు వచ్చింది. మున్సిపల్ సిబ్బంది జీతాలు ఎలా చెల్లిస్తున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి మున్సిపల్ కమిషనర్‌ను ప్రశ్నించారు. దీనికి కమిషనర్ స్పందిస్తూ ఇంటి పన్ను వసూళ్ల ద్వారా సిబ్బంది జీతాలు చెల్లిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పాత గ్రామపంచాయతీ కాలం లో అమలులో ఉన్న పన్నులను కనీసం ఆరు నెలల పాటు కొనసాగిం చాలని ఎమ్మెల్యే సూచించారు. మున్సిపాలిటీ ఆర్థిక వ్యవస్థ స్థిరపడే వరకు అదే విధానాన్ని పాటించడం మంచిదని అభిప్రాయపడ్డారు.
ఇదే అంశంపై బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు కూడా స్పం
దిస్తూ ప్రస్తుతం ప్రజలపై అదనపు పన్నుల భారం వేయకుండా సిబ్బంది జీతాల సమస్యను మున్సిపల్ బడ్జెట్‌లోనే పరిష్కరించాలని కోరారు. అభివృద్ధి పనులు ప్రజలకు కనిపిస్తేనే పన్నులు చెల్లించే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. కనీసం ఒక సంవత్సరం పాటు పాత పన్నుల విధానాన్ని కొనసాగించా లని కోరారు. లేదంటే ప్రజలు తమను ప్రశ్నించే పరిస్థితి వస్తుందని అన్నారు. అనంతరం బడ్జెట్‌లో ఆదాయం, ఖర్చులను ఎలా సమతు ల్యం చేయాలో సూచనలు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్‌కు ఎమ్మెల్యే కడియం సూచించారు.
మొత్తం మీద సమావేశంలో మున్సిపల్ అభి వృద్ధి, నిధుల వినియోగం, పన్నుల విధానం వంటి అంశాలపై విస్తృతం గా చర్చ జరిగింది.ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, వైస్ చైర్మన్ నీల రాజమ్మ, కౌన్సిలర్లు చల్లా రమ్య, బొల్లు లక్ష్మి, గట్టు సం గీత, పొన్న స్వరూప, అంగడి రజిత, తోకల అనూష, సౌదరపల్లి సంప త్ రాజు, పొన్న రవి, పొన్న రాజేష్, బూర్ల రాజేశ్వర్, బాలగాని అనిల్, గుర్రం హరినాథ్, శానిటేషన్ ఇన్ స్పెక్ట ర్ లింగయ్య, మున్సిపల్ మేనే జర్ సత్యం, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
