ఘనంగా సర్పంచ్ కాటం వెంకటేశం జన్మదిన వేడుకలు

చిట్యాల, ఆంధ్రప్రభ ; నకిరేకల్ శాసనసభ్యులు, ముఖ్య అనుచరుడు చిట్యాల మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పెద్దకాపర్తి గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం జన్మదిన సందర్భంగా గురువారం నాడు నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం ను సర్పంచ్ కాటం వెంకటేశం మర్యాదపూర్వకంగా కలిసి ఎమ్మెల్యే ఆశీర్వాదం తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం, సర్పంచ్ కాటం వెంకటేశం కు కేక్ కట్ చేసి, శాలువాతో ఘనంగా సన్మానించి కేక్ తినిపించి ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల కనకదుర్గ అమ్మవారి ఆలయ చైర్మన్ మారగోని ఆంజనేయులు గౌడ్, చిన్నకాపర్తి సర్పంచ్ ఆవుల సుందర్, పెద్ద కాపర్తి వార్డు సభ్యులు కుర్రు యాదయ్య, సాగర్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply