అంగడి వేలంపాట రూ.24 లక్షల 4వేలు

అంగడి వేలంపాట రూ.24 లక్షల 4వేలు

నర్సింహులపేట, ఆంధ్రప్రభ : నర్సింహులపేట అంగడి నిర్వహణను ఏడాది పాటు దక్కించుకోవడం కోసం పలు ప్రాంతాలకు చెందిన 33 మంది గుత్తేదారులు వేలంపాటలో పోటీపడ్డారు.మండల కేంద్రంలో ప్రతి శనివారం నిర్వహించే సంత బహిరంగ వేలం పాటను గురువారం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మండల పంచాయతీ అధికారి కిన్నర యాకయ్య, గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, సర్పంచ్ పెదమాముల యాకయ్య, ఉప సర్పంచ్, కాస యాకయ్య సమక్షంలో నిర్వహించారు. అంగడి నిర్వహణను ఏడాది పాటు దక్కించుకోవడం కోసం పోటీపడ్డారు.

చివరకు అంగడి నిర్వహణను రూ.24 లక్షల 4 వేలకు నర్సంపేట పట్టణానికి చెందిన పాలకుర్తి ప్రభాకర్ బహిరంగ వేలంలో దక్కించుకున్నారు. ఈ సందర్భంగా మండల పంచాయతీ అధికారి కిన్నర యాకయ్య మాట్లాడుతూ.. అంగడి వేలం పాటను దక్కించుకున్న కాంట్రాక్టర్లు నిబంధనల మేరకు గ్రామ పంచాయతీకి సకాలంలో నిధులు జమ చేయాలని చేయాలన్నారు.గ్రామ పంచాయతీ నిర్దేశించిన నియమ నిబంధనలను ఉల్లంఘించినట్లయితే కాంట్రాక్టు రద్దు చేసే అధికారం గ్రామ పంచాయతీకి ఉంటుందని అన్నారు.

కాగా గత ఏడాది రూ.16లక్షల 55 వేలకు నర్సింహులపేట మండలంలోని కౌసల్యదేవిపల్లి గ్రామానికి చెందిన కొత్త వెంకటయ్యకు ఖరారు కాగా ఈసారి పెద్ద మొత్తంలో సంత వేలం రావడం హర్షణీయమని నూతన సర్పంచ్ పెదమాముల యాకయ్య హర్షం వ్యక్తం చేశారు. మండలంలోని పెద్దనాగారం స్టేజిలో నిర్వహించే సంత వేలం పాట రూ.77 వేలకు అదే గ్రామానికి చెందిన చలమల్ల నరేష్ వేలంలో దక్కించుకున్నారు.

Leave a Reply