14లోగా టీచర్ల ప్రొఫెషనల్ టాక్స్ చెల్లించాలి

14లోగా టీచర్ల ప్రొఫెషనల్ టాక్స్ చెల్లించాలి
ఎంఈఓ విజయకుమార్
జన్నారం రూరల్, ఆంధ్రప్రభ : ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలు తప్పకుండా ఉపాధ్యాయుల ప్రొఫెషనల్ టాక్స్ ను ఈనెల 14లోగా చెల్లించాలని స్థానిక ఎంఈఓ ఎన్.విజయ్ కుమార్ తెలిపారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల విద్యా వనరుల కేంద్రంలో బుధవారం ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వ ఆదేశాల మేరకు తప్పకుండా ప్రైవేట్ యజమాన్యాల నిర్వాహకులు ఆ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ల ప్రొఫెషనల్ ట్యాక్సీని చెల్లించాలన్నారు.
చెల్లించిన ప్రతుల ఆధారాలను తమ కార్యాలయంలో అందజేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ విద్యా సంస్థల ప్రిన్సిపాల్స్ , కరెస్పాండెంట్లు మధుసూదన్, కస్తూరి సతీష్ కుమార్, ఎదులాపురం శ్రీనివాస్, అమరగొండ సతీష్ గౌడ్, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.
