కవయిత్రి మొల్లమాంబ జయంతి ఉత్సవాలు..

కవయిత్రి మొల్లమాంబ జయంతి ఉత్సవాలు..
భువనగిరి/ ఆంధ్రప్రభ : ఈ నెల 13న జిల్లా కేంద్రంలోని కుమ్మరివాడలో గల మొల్లమాంబ విగ్రహం వద్ద కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించు జయంతి ఉత్సవాలలో పాల్గొనాలని కోరుతూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్, కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షులు ఓరుగంటి గోపాల్, పట్టణ అధ్యక్షులు చినగారి బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.
