బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ..

బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ..

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని వలిగొండ రోడ్డులో ఉన్న శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో ఈ నెల 13,14,15, తేదీలలో మూడు రోజుల పాటు నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్ ను స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ నెల 15న శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అవసరమైన ఏర్పాట్లు చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, మంచికంటి భాస్కర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్, దేవాలయ కమిటీ అధ్యక్షులు నాగిళ్ల రామచంద్రం, ఉపాధ్యక్షులు చింతల ప్రభాకర్ రెడ్డి, కార్యదర్శి ఊదరి శంకర్, కార్యవర్గ సభ్యులు ఎలక రాజు మల్లేష్, ఉదరి శ్యామ్, ఉష్కాగుల శ్రీనివాస్, కాసుల వెంకటేష్, ఆరుట్ల లింగస్వామి, చేవగోని మహేష్ గౌడ్, గంగిరెడ్డి నాగలక్ష్మి, ఊదరి మారయ్య, గట్టు పవన్ తదితరులు పాల్గొన్నారు.