రైతులకు ఉద్యాన పంటలపై అవగాహన, శిక్షణ కార్యక్రమం

రైతులకు ఉద్యాన పంటలపై అవగాహన, శిక్షణ కార్యక్రమం
- పాల్గొన్న జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఏ. సునీల్ కుమార్
చిట్యాల, ఆంధ్రప్రభ : జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలోని రామచంద్రాపూర్ , కైలాపూర్ గ్రామ శివారులో సోమవారం జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఉద్యాన పంటలపై అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఏ. సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. డ్రిప్ పరికరాల పనితీరుపై జైన్ డ్రిప్ కంపెనీ ద్వారా ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఏ. సునీల్ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉద్యాన పంటల సాగులో రైతులు అనుసరించాల్సిన మెలకువలు, పంటల యాజమాన్య పద్ధతుల గురించి వివరించారు. ఉద్యాన శాఖ ద్వారా అమలవుతున్న వివిధ పథకాల గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఉద్యాన పంటల సాగు ద్వారా రైతులు తక్కువ భూమిలో ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉందని తెలిపారు. కూరగాయలు, పండ్ల తోటలు, ఆయిల్ పామ్ వంటి ఉద్యాన పంటల సాగు ద్వారా మార్కెట్లో మంచి ధర లభించి రైతుల ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు.

అలాగే డ్రిప్ సాగు విధానాన్ని అనుసరించడం ద్వారా నీటి పొదుపు జరిగి పంటల ఉత్పత్తి పెరుగుతుందని వివరించారు.ఈ సందర్భంగా సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం, తెలంగాణ సూక్ష్మ నీటి పారుదల పథకం, నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ పామ్ ,వంటి పథకాల ప్రాముఖ్యత, వాటి ద్వారా రైతులకు లభించే ప్రయోజనాలను రైతులకు వివరించారు. అదేవిధంగా రైతులు పంట మార్పిడి విధానాన్ని అనుసరించడం ద్వారా అధిక ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయని సూచించారు.
కార్యక్రమం అనంతరం జైన్ డ్రిప్ కంపెనీ జోనల్ మేనేజర్ భవాని ప్రసాద్ రైతులకు డ్రిప్ వ్యవస్థ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్వహణ పద్ధతులు, నీటి పొదుపు ద్వారా పంటల ఉత్పత్తి పెంపు గురించి వివరించారు. అనంతరం తెలంగాణ ఉద్యాన మిషన్ పథకం కింద రైతులకు కూరగాయల మినీ కిట్లను ఉచితంగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఉద్యాన విస్తరణ అధికారి రామాచారి, రామచంద్రాపూర్ సర్పంచ్, గా జే హేమలత– అశోక్, ఆయిల్ పామ్ ఇన్చార్జ్ వాసు, ఫినోలెక్స్ కంపెనీg ప్రతినిధి శ్యాం కుమార్, రైతులు వల్లకొండ లింగారెడ్డి, సమ్మిరెడ్డి, గంపల రమేష్, మధుకర్, సతీష్, ఆయిల్ పామ్ మండల ప్రతినిధులు సాయి, ప్రీతం తదితరులు పాల్గొన్నారు.
