స‌మాజాభివృద్ధి మహిళలతోనే….

స‌మాజాభివృద్ధి మహిళలతోనే….

రాప్తాడు, ఆంధ్రప్రభ : మహిళలు వ్యాపారంలోనూ వ్యవసాయంలోనూ రాణించాలని ఏ ఎఫ్ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ వైవి మల్లారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రాప్తాడు మండల పరిధిలోని ఆర్డీటి ఏరియా ఫీల్డ్ ఆఫీసు నందు ఏ ఎఫ్ ఎకాలజీ సెంటర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆర్డీటి ఆఫీసు నుండి రాప్తాడు బస్టాండ్ వరకు మహిళలతో ర్యాలీ నిర్వహించి బస్టాండ్ సర్కిల్ నందు మానవహారం చేపట్టారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డైరెక్టర్ వైవి మల్లారెడ్డి ఏఎల్ పి కోఆర్డినేటర్ రిజ్వానా మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ మహిళలు సాధికారత సాధించినప్పుడే సమాజం దేశం నిజమైన అభివృద్ధి సాధిస్తుంది అని అన్నారు. జిల్లా రాష్ట్రం దేశాన్ని ఆర్థికంగా బలంగా నిలబెట్టడంలో మహిళామణుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు.గ్రామీణ మహిళల్లో దాగిఉన్న ప్రతిభను వెలికి తీసి వాళ్ళను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఏ ఎఫ్ ఎ కాలేజి సెంటర్ పనిచేస్తోందన్నారు.

మహిళలకు సాంకేతిక పరిజ్ఞానం వ్యాపార నైపుణ్యాలు అందిస్తూ స్వావలంబన దిశగా ముందుకు నడిపిస్తున్నామని చెప్పారు. గ్రూపుల వారీగా చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు చేస్తూ స్వతంత్రంగా కుటుంబాన్ని పోషించుకునే స్థాయికి తీసుకొస్తామన్నారు. కొన్ని ఏరియాల్లో మహిళలు గ్రూపులు చిన్న పరిశ్రమలు పెట్టుకొని లబ్ధి పొందుతూ కుటుంబాలను పోషించుకుంటూ స్వతంత్రంగా జీవిస్తున్నారని తెలియజేశారు.

అనంతరం రైతులకు ప్రజలకు ఉత్తమ సేవలందించిన క్రియాశీలక లీడర్లకు ఘనంగా సన్మానం చేసి మెమొంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కమ్యూనికేషన్ కోఆర్డినేటర్ రమేష్ సుసర్ల సీఈఓ దిలీప్ కుమార్ క్యాంపస్ ఇంచార్జ్ షేక్షావలి రాప్తాడు ధర్మవరం ఎంటిఎల్ లు మల్లేష్ దస్తగిరి ఎస్ టి ఓలు విక్రమ్ అజేష్ ఏఈఏ అథార్ సూపర్వైజర్ కుళ్ళాల్లప్ప మేనేజర్ ప్రతాప్ క్రియాశీలక లీడర్లు కొండారెడ్డి బాబయ్య పురుషోత్తం రెడ్డి అంజనమ్మ లక్ష్మీదేవి శ్రీదేవి వెంకటరమణమ్మ అనురాధ రమణమ్మ సుభద్రమ్మ తులసమ్మ వివిధ గ్రామాల మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply