జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం..

జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం..
జనసేన జిల్లా కార్యదర్శి కొండవీటి సునీత సర్పంచ్ యర్రం శెట్టి శ్రీ దుర్గా కు సత్కారం
కోడూరు, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని కోడూరు మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో పార్టీ మండల అధ్యక్షులు మరే గంగయ్య పర్యవేక్షణలో కోడూరు ప్రధాన సెంటర్లో జనసేన పార్టీలో పనిచేస్తున్న వీర మహిళలను ఘనంగా శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.లింగా రెడ్డి పాలెం గ్రామ సర్పంచ్ యర్రం శెట్టి శ్రీ దుర్గా, జనసేన పార్టీ కృష్ణాజిల్లా కార్యదర్శి కొండవీటి సునీతలను శాలువగప్పి ఘనంగా సత్కరించి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ కోడూరు మండలజనసేన పార్టీ ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాల నుండి కూడా వీర మహిళను సన్మానించడం చాలా సంతోషంగా ఉందని సందర్భంగా తెలిపారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజును గుర్తించి ఈ విధంగా అందరి మధ్య సన్మానించడం గర్వంగా, సంతోషంగా వుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మరే గంగయ్య కోడూరు పట్టణ అధ్యక్షులు కోట రాంబాబు, కోడూరు, లింగారెడ్డి పాలెం పిఎసిఎస్ అధ్యక్షులు పూత బోయిన కరుణ్ కుమార్,కోట సుబ్బారావు, సాలెం పాలెం నీటి సంఘాల అధ్యక్షులు బడే భవన్ నారాయణ, ముద్ధినేని చంద్రరావు, కాగిత రామారావు, కోడూరు మండల తెలుగు యువత మాజీ అధ్యక్షులు బడే గాంధీ,మల్లా వెంకటేశ్వరరావు పరిశే వెంకటేశ్వర్రావు, బచ్చు పూర్ణచంద్రరావు,బడే కృష్ణ, చిట్టిప్రోలు సుబ్బారావు ఉల్లి వెంకటేశ్వరరావు తో పాటు పలువురు నేతల పాల్గొన్నారు
