90 అడుగుల దివ్యప్రభోత్సవం వేడుక….

90 అడుగుల దివ్యప్రభోత్సవం వేడుక….

పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీ తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ్ళు ఉత్సవాల్లో భాగంగా తిరుణాలలో అత్యంత ప్రధాన ఘట్టమైన శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దివ్య ప్రభ మహోత్సవం కార్యక్రమం వైభవంగా జరిగింది. ముందుగా ఆలయ వేద పండితులు, అర్చకులు పురోహితులు లో ఆధ్వర్యంలో వేదమంత్రోచరణ లతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ రకాల గజ పూలపూలమాలలుతో విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించిన 90 అడుగుల ప్రభ పైకి ఉత్సవమూర్తులను వుంచి మేళా తాళాలతో సన్నాయి డప్పులు తీన్ మార్ కోలాటం నృత్య ప్రదర్శనలతో భారీ ఊరేగింపులతో ఉత్సవం ముందుకు సాగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలు నుండి వచ్చిన భక్తులు దివ్య ప్రభోత్సవం చూసి భక్తులు ఆనంద పరవంతం అయ్యారు.

అమ్మవారి ఉత్సవానికి గ్రామంలోని మహిళా భక్తులు నీళ్ళతో వారులు పోసి కొబ్బరి కాయలు కొట్టి పూజలు నిర్వహించారు. ఈ మహోత్సవం ను తిలకించేందుకు ఆలయం చుట్టూ ప్రజలు, భక్తులు బారులు తీరారు. నందిగామ ఏసిపి ఆధ్వర్యంలో జగ్గయ్యపేట సిఐ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో స్థానిక ఎస్ఐ అర్జున్, పోలీస్ సిబ్బంది ప్రత్యేకమైన రోప్ వే ఏర్పాటు చేసి ప్రత్యేక బలగాలతో బందోబస్తు నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆలయ కార్యనిర్వానాధికారి బి మహేశ్వర్ రెడ్డి ఉత్సవ కమిటీ చైర్మన్ చుంచు రమేష్ బాబు ఏ ఈ ఓ జంగం శ్రీనివాసరావు ఏఈలు అరవింద్ రాజు ‌‌‌‌‌తహసీల్దార్ శాంతి కళ్యాణి ఎంపీడీవో శ్రీను వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply