కమిషనర్ నిర్లక్ష్యం…

కమిషనర్ నిర్లక్ష్యం…
మండిపడ్డ పలువురు కౌన్సిలర్లు
సమస్యలపై మాట్లాడేందుకు చేసిన ఫోన్ కాల్స్‌కు స్పందన లేదు
మీటింగ్ సమాచారం ఇవ్వలేదని అసంతృప్తి
99 రోజుల కార్యాచరణ సమావేశంలో ఉద్రిక్తత
స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ: స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహిం చిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక సమావేశం ప్రారంభం కాకముందే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు అమలు చేయనున్న కార్యక్రమాలపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలి టీలో జరుగుతున్న కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు పలుమార్లు ఫోన్ చేసినా కమిషనర్ స్పందించడం లేదని ఆరోపించారు.
ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయకపోవడంతో పాటు పంపిన సందేశాలకు కూడా స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సిలర్లకు సంబం ధించిన విషయాల్లో కమిషనర్ ఇన్‌రెగ్యులర్‌గా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అదే విధంగా ఈరోజు నిర్వహించిన సమావేశానికి సంబంధించిన సమాచారం కూడా పలువురు కౌన్సిలర్లకు ముందుగా ఇవ్వలేదని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం మీటింగ్ గురించి సమాచారం ఇవ్వకపోవడం తమ పదవికి అవమానంగా భావిస్తున్నా మని తెలిపారు.
-కౌన్సిలర్ల సమస్యలను పట్టించుకోవాలి:
మొదటి కార్యక్రమం నుంచే కమిషనర్‌తో ఇలాంటి వివాదాలు తలెత్తడం మున్సిపాలిటీ పరిపాలనపై ప్రభావం చూపుతుందని పలువురు కౌన్సి లర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కౌన్సిలర్ల సమస్యలను పట్టించుకోవా లని, వెంటనే స్పందన ఇవ్వాలని కమిషనర్‌ను డిమాండ్ చేశారు. ఈ విషయంపై కమిషనర్ సమావేశంలో వెంటనే స్పందిస్తూ..తాను కలెక్టర్ కార్యాలయంలో సమావేశంలో ఉన్నందున ఫోన్‌లు లిఫ్ట్ చేయలేకపో యానని చెప్పాడు. అయితే తరువాత తిరిగి ఫోన్ చేయవచ్చని కౌన్సి లర్లు ప్రశ్నించారు. దీంతో కొంతసేపు సమావేశంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ తరువాత సమావేశం కొనసాగింది.
