war| బాంబుల వ‌ర్షం

war| బాంబుల వ‌ర్షం

  • ఇరాన్ డ్రోన్ దాడులు
  • గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యం..
  • స్వల్పంగా దెబ్బతిన్న అమెరికా ఎంబసీ భవనం

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఇరాన్‌పై యూఎస్-ఇజ్రాయిల్ భీకర యుద్ధం జ‌రుగుతోంది. ప‌ర‌స్ప‌రం బాంబుల దాడులు చేసుకుంటున్నాయి. రోజురోజుకూ దాడులు అంతకంతకు తీవ్రమవుతున్నాయి. ఇరాన్ డ్రోన్ దాడిలో అమెరికా ఎంబసీ భవనం స్వల్పంగా దెబ్బతిన్నది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు ఉద్ధృతం చేసింది. సౌదీ, బహ్రెయిన్‌, ఖతార్‌, కువైట్‌పై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఎంబీసీలపైనా బాంబుల వ‌ర్షం కురిపిస్తోంది. సౌదీ రాజధాని రియాద్‌లోని అమెరికా ఎంబసీపై డ్రోన్లతో ఇరాన్ విరుచుకుపడింది. ఇరాన్ డ్రోన్ దాడిలో అమెరికా ఎంబసీ భవనం స్వల్పంగా దెబ్బతిన్నది.

కువైట్‌లో రాయబార కార్యాలయాన్ని అమెరికా మూసివేసింది. బహ్రెయిన్‌లోని అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తోంది. దీంతో అమెరికా ప్రధాన కార్యాలయం, సిబ్బంది నివాసాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. బహ్రెయిన్‌లోని అమెరికా నౌకాస్థావరం నుంచి పొగలు వస్తున్న వీడియో వైరల్ అవుతోంది. పోర్టులో నిలిచి ఉన్న చమురునౌకపై డ్రోన్ దాడి జరిగిందని ఒమన్ మీడియా వెల్లడించింది. ఖతార్‌ ఇంధన కేంద్రంపై కూడా దాడి జరిగినట్లు సమాచారం. టెహ్రాన్‌ దాడుల్లో తమ సైనికులు ఆరుగురు చనిపోయారని అమెరికా వెల్లడించింది.

Leave a Reply