morethan80%import | ఇరాన్ యుద్ధ ప్రభావం… భారత్‌లో ఏయే ధరలు మోతెక్కనున్నాయి?

morethan80%import | ఇరాన్ యుద్ధ ప్రభావం… భారత్‌లో ఏయే ధరలు మోతెక్కనున్నాయి?

morethan80%import | మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు – భారత ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం?
మొదటి దెబ్బ ఇంధనానికేనా? పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి
ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరల పెరుగుదలతో గృహిణులకు భారమా?
బంగారం పరుగులు… పెట్టుబడిదారుల దృష్టి ‘సేఫ్ హావెన్’ వైపు
వ్యవసాయ రంగంపై ప్రభావం – ఎరువులు, దిగుమతి ఉత్పత్తుల ఖర్చులు
రవాణా, విమానయాన, రసాయన పరిశ్రమలపై తక్షణ ప్రభావం
రూపాయి విలువపై ఒత్తిడి – ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదమా?
సాధారణ ప్రజల బడ్జెట్‌పై యుద్ధం ప్రభావం ఎంతవరకు?
దీర్ఘకాల యుద్ధం జరిగితే పరిస్థితి ఎలా మారుతుంది?

morethan80%import | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మధ్యప్రాచ్యంలో, ముఖ్యంగా ఇరాన్ చుట్టూ బిగుసుకుంటున్న యుద్ధ భీభత్సం ప్రపంచ దేశాల మార్కెట్లను కుదిపేస్తున్నాయి. యుద్ధం ఫలితంగా చాలా దేశాలకు చమురు సరఫరాలో తీవ్రమైన అంతరాయం ఏర్పడే ప్రమాదం పొంచి ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మనదేశం విషయానికొస్తే, మన దేశ అవసరాలకు 80% కంటే ఎక్కువ ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నాం.. ఆ చమురులో ఎక్కువ భాగం మధ్య ప్రాచ్య దేశాల నుంచే దిగుమతి అవుతుంది.

కనుక ఆ దేశాలలో ఉద్రిక్తతలు పెచ్చుమీరితే, మనదేశ ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపే అవకాశాలు తక్కువేం కాదు. అక్కడి యుద్ధవాతావరణం దెబ్బ ఇంధనానికే తగులుతుంది. యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే, భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం అనివార్యం.

morethan80%import

ఇక అక్కణ్ణుంచి ధరల పెరుగుదల సైకిల్ మొదలవుతుంది..ఇంధన ధరలు పెరిగితే, రవాణా ఖర్చులు పెరుగుతాయి, సరుకుల రవాణా ఖరీదు అధికమవుతుంది..అంతిమంగా ఏ వస్తువైనా వినియోగదారుడి చేతికొచ్చేవరకు ఖర్చులన్నీ తడిసి, చివరికి వినియోగదారులే ఆ వస్తువులకు అధిక ధరలు చెల్లించాల్సి వస్తుంది.

ఇది నేరుగా ప్రతి కుటుంబ బడ్జెట్‌పై ప్రభావం చూపిస్తుంది. ఇక ప్రతి ఇంటికీ అవసరమయ్యే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర పెరుగుతుంది. ఎందుకంటే ముడి చమురు ధరలు పెరిగితే, వంట గ్యాస్ ధరలు ఆటోమేటిక్ గా పెరిగే అవకాశం ఉంటుంది. భారత్ లో ఇప్పటికే పెరిగిన గ్యాస్ ధరలతో ఇబ్బంది పడుతున్న మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు యుద్ధం పేరుతో పెరిగే భరలు మరింత భారంగా మారతాయి.

morethan80%import

ఇప్పటికే ఆకాశంలో ఎక్కడో పరుగులు తీస్తున్న బంగారం విషయానికొస్తే…యుద్ధాలు, అంతర్జాతీయ అస్థిరతలు పెరిగినప్పుడు పెట్టుబడిదారుల దృష్టి స్థిరమైన పెట్టుబడిగా ఉండే బంగారం వైపు మళ్లడం సాధారణం. అందువల్ల బంగారం ధరలు పరుగులు మరింత వేగం పుంజుకుంటాయి. తద్వారా పెట్టుబడిదారుల డిమాండ్ అధికమవుతుంది..

వివాహాది శుభకార్యాలలో ప్రధాన పాత్ర పోషించే ఆభరణాల కొనుగోలుపై తీవ్ర ప్రభావం పడుతుంది. భారత్‌లో బంగారం వినియోగం ఎక్కువగా ఉండటంతో, ధరల పెరుగుదల సాధారణ ప్రజలపై కూడా తీవ్రమైన ప్రభావమే చూపుతుంది. భారత్ ప్రధానంగా వ్యవసాయాధారిత దేశం. పంటలకు కావాల్సిన ఎరువులు, అలాగే వ్యవసాయానికి అవసరమయ్యే దిగుమతి ఉత్పత్తుల ధరలు పెరిగి, రైతులకు ఇబ్బంది కలిగిస్తాయి.

morethan80%import

ఇరాన్ ప్రాంతం ద్వారా గ్యాస్, పెట్రో కెమికల్ ఉత్పత్తుల సరఫరా కూడా జరుగుతుంది. యుద్ధం వల్ల ఆ సరఫరా ఆగితే, ఎరువుల ధరలు పెరిగి, వ్యవసాయ ఖర్చులు అధికమయ్యే ప్రమాదం ఉంది..ఇవన్నీ పెరిగినప్పుడు ఆహార ధాన్యాల ధరలపై ప్రభావం పడుతుంది. దీని వల్ల రైతులపై అదనపు ఒత్తిడి పడవచ్చు. నేరుగా రైతులు ధరలు పెంచలేకపోయినా, వారికి లబ్ధి కలగక పోయినా, కచ్చితంగా దళార్లకు మాత్రం లాభమే కలిగించవచ్చు.

పైన పేర్కొన్నట్టు నేరుగా ప్రభావం పడే రంగాలు, చమురు, ఇంధన రంగం, రవాణా రంగం, విమానయాన సంస్థలు, రసాయన పరిశ్రమ, వ్యవసాయ రంగం, బంగారం & ఆభరణాల మార్కెట్ రంగాలపై తక్షణ ప్రభావం ఉండే అవకాశం ఉందని ఆర్థిక నిపుణుల అభిప్రాయం. ఇక అంతర్జాతీయ పరిణామాలకు అతలాకుతలమైపోయే రూపాయి విలువపై ప్రభావం కూడా ఎక్కువే. చమురు ధరలు పెరిగితే, చమురు కొనుగోలుకు భారత్ ఎక్కువ డాలర్లు చెల్లించాల్సి వస్తుంది.

morethan80%import

దీనివల్ల రూపాయి విలువ తగ్గే అవకాశం ఉంటుంది. అన్ని దిగుమతుల ఖర్చు పెరుగుతాయి కనుక ద్రవ్యోల్బణ ఒత్తిడి తీవ్రం కావచ్చు. ఇవి మొత్తం మన భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. ఇరాన్ ప్రాంతంలో యుద్ధం ముదిరితే, భారత్‌లో ఇంధన ధరలు, ఎల్ పీజీ, బంగారం, ఎరువులు, రవాణా ఖర్చులు వంటి అనేక అంశాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.

ప్రస్తుతం పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం సమీక్షిస్తూ ఉందని ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి. అయితే యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే మాత్రం, సాధారణ ప్రజల రోజువారీ జీవితంపై మరింత భారంగా మారే ప్రమాదం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ మార్కెట్ల మార్పులను బట్టి రాబోయే రోజుల్లో ధరల పరిస్థితి స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply