జుక్కల్ లో ఘనంగా హోలీ సంబరాలు

జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : జుక్కల్ మండల కేంద్రంతోపాటు మండలంలోని అన్ని గ్రామాలలో హోలీ పండుగ సంబరాలు ఆనంద ఉత్సవాలతో జరుపుకున్నారు.ఉదయం నుండే చిన్నారులు, యువకులు,వ్యాపారస్తులు,ఉద్యోగులు అందరూ కలిసి హోలీ పండుగను ఘనంగా నిర్వహించారు.ఒకరికొకరు రంగులు పూసుకోవటమే కాకుండా హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చిన్న పెద్ద తేడాలేకుండా కులమతాలకతీతంగా ఆప్యాయంగా ఒకరు ఒకరు రంగులు పూసుకోవడం జరిగింది.
