Gold@2Lakhs | గోల్డ్ రేట్ నాన్ స్టాప్ Andhra Prabha TopStory

Gold@2Lakhs | గోల్డ్ రేట్ నాన్ స్టాప్ Andhra Prabha TopStory

Gold@2Lakhs | ఇరాన్ .. ఇజ్రాయెల్ జ‌గ‌డం
షేర్ మార్కెట్లు ధ్వంసం
సేఫ్ హెవెన్ వైపు.. మ‌దుప‌ర్లు మ‌క్కువ‌
బంగారం దిగుమ‌తికి బ్రేక్
ముడిచ‌మురు ధ‌ర ఆజ్యం ఫ‌లితం
మ‌ధ్య‌త‌ర‌గ‌తి బ‌హుదూరం
అగ్ర రాజ్యాల బంగారం వేట‌
చైనా డాల‌ర్ వార్
భార‌త్ బంగారు బాతే

( ఆంధ్ర‌ప్ర‌భ‌, బిజినెస్ డెస్క్)

ద‌స‌రా పండ‌క్కి బావ‌మ్మ‌ర్థికి బ్రాస్ లెట్ కొందామంటే.. తులం బంగారం రేటు ₹ 1,25,000 కావ‌టంతో.. రోల్డ్ గోల్డ్ బ్రాస్ లెట్ తో ముచ్చ‌ట తీర్చి… మ‌ళ్లీ దీపావ‌ళికి బంగారం కొట్టుకు వెళ్తే.. తులం బంగారం ₹ 1,40.000 ధ‌ర‌తో ప‌ల‌క‌రించింది. ఇప్పుడు కాదు.. అని ఈ సారి సంక్రాంతికి త‌ప్ప‌ని స‌రిగా బ్రాస్ లెట్ కొన‌టానికి వెళ్తే ఈ సారి ₹ 10,000 త‌గ్గాయి. అంటే తులం బంగారం ధ‌ర ₹ 1,50,000ల‌తో ప‌ళ్లిగిలించింది.

ఈ సారి శివ‌య్య క‌రుణిస్తాడ‌ని శివరాత్రికి వెళ్తే తులం బంగారం ధ‌ర ₹ 1.65,000 ల‌కు చేరింది. ఇదేంటీ ఎప్పుడు వెళ్లినా బంగారం ధ‌ర పెరుగుతోంది., ఇంత‌కీ బంగారం ధ‌ర త‌గ్గుతుందా? లేదా ? ఈ మ‌ధ్య‌త‌ర‌గ‌తి జీవి త‌న‌లో తాను ప్ర‌శ్నించుకుంటే.. ఓర్నీ.. స‌రీగా ఏడాది కింద‌ట తులం బంగారం ధ‌ర ₹ 72,500లు . కానీ ఆరోజునే కొని ఉంటే.. ఈపాటికి రెండున్నర రెట్లు విలువ పెరిగేది క‌దా అని ప‌క్కింటి మ‌దుపరి విశ్లేషిస్తే.. ఈ మ‌ధ్య‌త‌ర‌గ‌తి బావ‌కు క‌ళ్లు తిరిగాయి. ఇంత‌కీ బంగారం ధ‌ర‌.. త‌గ్గుతుందా?. ఇలాగే పెరుగుతూ పోతుందా? అని ప్ర‌శ్నిస్తే… ఔను బంగారం ధ‌ర ప‌రుగు ఆగ‌దు.. ఆగ‌దు. అస‌లు ఎందుకు గోల్డ్ రేట్ ర‌న్ ఆగ‌దంటే…!?

@ 2LAKH : అగ్ర‌రాజ్యాల లొల్లి

Gold@2Lakhs
Gold@2Lakhs

స‌హ‌జ ఖ‌నిజ సంప‌ద‌ల ఆధీనం.. ఇత‌ర దేశాల‌పై పెత్త‌నం , ఆధిప‌త్యం కోసం..ఒక వైపు ర‌ష్యా, ఉక్రెయిన్ మ‌ధ్య వార్‌.. ఇంకో వైపు పాల‌స్టీనాతో ఇజ్రాయెల్ పేచీ.. మ‌రో వైపు వెనిజులా పై అమెరికా దాడి.. తాజాగా ఇరాన్ పై ఇజ్రాయెల్‌, అమెరికా జాయింట్ ఆప‌రేష‌న్‌.. ఇలా గ‌త కొన్నేళ్లుగా వ‌శుధైక ప్ర‌పంచంలో భౌగోళిక అనిశ్చితి .. టెన్ష‌న్ క్రియేట్ చేస్తుంటే… ప్ర‌పంచ దేశాలు అల్లాడిపోతుంటే.. అగ్ర‌రాజ్యాల మ‌ధ్య మ‌రో జ‌గ‌డం రూపుదిద్దుకుంది. అదే డాల‌ర్ ప‌త‌నం. అమెరికా పెద్ద‌న పాత్ర‌కు చెక్ చెప్పేందుకు చైనా కీల‌క పాత్ర పోషిస్తోంది. ఇదే త‌రుణంలఓ చైనా, ర‌ష్యాలకు చ‌మురు కొర‌త‌ను సృష్టించ‌టానికి అమెరికా నానా అగ‌చాట్లు ప‌డుతోంది. ఇది స‌భ్య‌దేశాల తెర‌పై క‌నిపించే అగ్ర‌రాజ్యాల ఆధిప‌త్య పోరాట స‌న్నివేశం. కానీ స‌భ్య స‌మాజం ఎరుగని మ‌రో క‌థ ఇప్పుడిప్పుడే ఇకిలిస్తోంది.. అదే బంగారం వేట‌.. వెండికి తాళం. ఈ మాట‌కు ఆశ్చ‌ర్యం స‌ర్వ‌సాధార‌ణం. కానీ ప‌చ్చి నిజం.

Gold@2Lakhs | కేవ‌లం ఏడాదిలో

గత ఏడాది (మార్చి 2025) నుంచి ప్రస్తుతం (మార్చి 2026) వ‌ర‌కూ.. బంగారం మార్కెట్ స్థితి గ‌తిని ప‌రిశీలిస్తే.. కేవ‌లం 12 నెల‌ల్లో బంగారం ధరలు దాదాపు 2.3 రెట్లు అంటే 234% కంటే ఎక్కువ పెరిగింది. మార్చి 2025 న‌ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర ₹ 72,500లు కాగ మార్చి 2026 లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర ₹ 1,70,000లు. అంటే ఏదాడిలో తులం బంగారం ధ‌ర రెండున్న‌ర రెట్టు పెరిగింది. ప్ర‌పంచ వ్యాప్తంగా భౌగోళిక రాజ‌కీయ ప‌రిస్థితుల్లో అనిశ్చితితో.. ద్ర‌వ్యోల్బ‌ణం, స్టాక్ మార్కెట్ అనిశ్చితి కారణంగా మదుపర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు. Gold ETFs, గోల్డ్ బార్స్ , డిజిటల్ గోల్డ్ వైపు మ‌దుప‌ర్లు మొగ్గు చూపుతున్నారు. 2025లో బంగారంపై పెట్టుబ‌డి డిమాండ్ 73% (విలువ పరంగా) పెరిగింది.

ర‌ష్యా ఉక్రెయిన్ అల‌జ‌డి, వెనుజులా పై అమెరికా దాడి. ఇలా వివిధ దేశాల ఆధిప‌త్య పోరాటం ఘ‌ట‌న‌ల‌ను ప‌క్క‌న పెడితే.. తాజాగా ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా జాయింట్ ఆప‌రేష‌న్‌… ప‌శ్చిమాసియాలో హైటెన్ష‌న్ క్రియేట్ చేసింది. ఫ‌లితంగా.. హోర్ముజ్ జలసంధి మీదుగా చమురు రవాణా నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఆకాశం వైపు దూసుకు పోతోంది. ఇక మ‌దుపర్లు బంగారాన్ని సేఫ్ హెవెన్ గా ఎంచుకున్నారు. అంతే కాదు ఇరాన్ అణు కేంద్రాల్లో లీకేజీ ప్రచారం యుద్ధ భయాన్ని పెంచేసింది.

@ 2LAKH : ఇరాన్ కిరాక్ .. మార్కెట్ లబోదిబో

అంతర్జాతీయ మార్కెట్లను క‌కావిక‌లం చేసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ భారీగా క్షీణించింది. ఫ‌లితంగా దిగుమతి బంగారం ధర భారత్‌లో మరింత పెరిగింది. 24 క్యారెట్ల బంగారం: 10 గ్రాముల ధర ₹ 1,67,070 నుంచి ₹ 1,73,000 మధ్య ట్రేడ్ కాగ .₹ 1,70,510లకు చేరింది.

22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹1,53,148 నుంచి ₹1,58,940 ల‌కు చేరి..₹ 1,56,300 ద‌గ్గ‌ర నిల‌బ‌డింది. .ధరలు గరిష్ట స్థాయికి చేరడంతో రిటైల్ ఆభరణాల విక్రయాలు తగ్గాయి, ధరలు విపరీతంగా పెరగడంతో సాధారణ వినియోగదారులు ఆభరణాల కొనుగోలును వాయిదా వేస్తున్నారు,

దీనివల్ల 2026లో మొత్తం డిమాండ్ 600-700 టన్నులకు తగ్గే అవకాశం ఉందని World Gold Council (WGC) అంచనా వేసింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం బంగారం ధరల పెరుగుదల కొనసాగే అవకాశం ఉంది: భౌగోళిక పరిస్థితులు ఇలాగే కొన‌సాగితే 10 గ్రాముల బంగారం ధర ₹2 లక్షలకు చేరటం ఖాయ‌ని బులియ‌న్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.. సేఫ్ హెవెన్ గా .. బంగారంపై పెట్టుబ‌డికి మ‌దుప‌ర్లు ఒక వైపు క్యూ క‌డుతఉంటే.. బంగారం నిల్వ పెంచుకోవ‌టానికి అగ్ర‌రాజ్యాలు పోటీ ప‌డుతున్నాయి. ముఖ్యంగా అమెరికా, చైనా మ‌ద్య ఈ పోటీ తీవ్ర స్థాయికి చేరింది.

@ 2LAKH : సూప‌ర్ 8 లో ఇండియా

ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు ఆర్థిక స్థిరత్వం కోసం బంగారాన్ని భారీగా నిల్వ చేస్తున్నాయి. ఫిబ్రవరి 2026 నాటి తాజా నివేదికల ప్రకారం బంగారం నిల్వ‌ల్లో టాప్ 8 దేశాల్లో 8,133 టన్నుల ట‌న్నుల బంగారం నిల్వ‌తో అమెరికా (USA) ప్ర‌థ‌మ స్థానంలో్ అమెరికా నిల‌బ‌డ‌గా.. 3,350 టన్నులతో జర్మనీ , 2,452 టన్నులతో , ఇటలీ, 2,437 టన్నులతో ఫ్రాన్స్, 2,333 టన్నులతో రష్యా, 2,304 టన్నులతో చైనా, 1,040 టన్నులతో స్విట్జర్లాండ్, 880 టన్నులతో భారతదేశం (RBI) నిలిచాయి.

@ 2LAKH : ఔను బార‌త్ ..బంగారు బాతు

భారతీయ కుటుంబాల్లో బంగారం నిల్వ: లెక్క క‌డితే.. భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) ద‌గ్గ‌ర 880 టన్నుల బంగారం కంటే చాలా ఎక్కువే, భారతీయ కుటుంబ స‌భ్యుల ఆధీనంలో సుమారు 34,000 టన్నుల బంగారం (ఆభరణాలు, నాణేల రూపంలో) ఉందని అంచనా. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం ప్రైవేట్ నిల్వగా బావిస్తున్నారు. అమెరికా డాల‌ర్ కంటే.. నాలుగు రెట్ల బంగారం క‌లిగిన రూపాయి విలువ ప‌డిపోవ‌టానికి కార‌ణం.. జ‌నం చేతిలో బంగారం లెక్క ప‌రిగ‌ణ‌న‌లో లేక‌పోట‌మే అని విశ్లేష‌కుల అంచ‌నా.
.
@ 2LAKH : డాలర్​ పై చైనా వార్​

చైనా తన విదేశీ మారక నిల్వలలో డాలర్ ప్రభావం తగ్గించుకోవడానికి గత 15 నెలలుగా వరుసగా బంగారాన్ని కొనుగోలు చేస్తూ తన నిల్వలను పెంచుకుంటోంది. చైనా తన విదేశీ మారక నిల్వలలో అమెరికన్ డాలర్లపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి (De-dollarization) నిరంతరంగా బంగారాన్ని కొనుగోలు చేస్తోంది. 2026 ప్రారంభంలో కూడా ఈ ధోరణి కొనసాగుతోంది. జనవరి 2026 నాటికి, చైనా కేంద్ర బ్యాంక్ (PBOC) వరుసగా 15వ నెల కూడా బంగారాన్ని కొనుగోలు చేసింది. ఈ ఏడాది జనవరి నెలలో చైనా అధికారికంగా సుమారు 40,000 ట్రాయ్ ఔన్ల (సుమారు 1.2 టన్నులు) బంగారాన్ని సేక‌రించింది.

ఇలా చైనా బంగారం నిల్వలు 74.19 మిలియన్ ట్రాయ్ ఔన్లకు (సుమారు 2,308 టన్నులు) చేరుకున్నాయి. ప్ర‌స్తుతం బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడంతో, చైనా ఆధీనంలోని బంగారం విలువ $ 369.58 బిలియన్లకు ( ₹ 33,87,548 కోట్లు) పెరిగింది. చైనా అధికారికంగా ప్రకటించే దానికంటే వాస్తవానికి చాలా ఎక్కువ మొత్తంలో బంగారాన్ని సేకరిస్తోందని మార్కెట్ నిపుణులు , గోల్డ్‌మన్ సాచ్స్ వంటి సంస్థలు అంచనా వేస్తున్నాయి. బంగారం నిల్వలను పెంచుకుంటూనే, చైనా తన వద్ద U.S. ట్రెజరీ బాండ్లను (అమెరికా అప్పు పత్రాలు) 17 ఏళ్ల కనిష్ట స్థాయికి తగ్గించుకుంది. అంతర్జాతీయంగా ఆర్థిక ఆంక్షల నుంచి రక్షణ పొందడానికి తన కరెన్సీ (యువాన్) బలాన్ని పెంచ‌టానికే చైనా ఈ వ్యూహాత్య‌క “బంగారు వేటష‌ను సాగిస్తోంది.

ALSO READ : Iran War Shock | స్టాక్ మార్కెట్ ధ్వంసం

Leave a Reply