శతాధిక గ్రంథ రచనలు సిమ్మన్న సొంతం

శతాధిక గ్రంథ రచనలు సిమ్మన్న సొంతం
లోక్ నాయక్ పురస్కార గ్రహీత “ఆచార్య వెలమల సిమ్మన్నకు ఘన సన్మానం
నడిచే గ్రంధాలయం సిమ్మన్న
ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రభ : బహుభాషా కోవిదులు.. శతాధిక గ్రంధ రచయిత.. సిమ్మన్న అనితర అసాధారణ ప్రతిభావంతులనీ పలువురు వక్తలు కొనియాడారు.. సోమవారం ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య జెర్ర అప్పారావు అధ్యక్షతన లోక్ నాయక్ ఫౌండేషన్ అవార్డు గ్రహీత ప్రముఖ గ్రంథకర్త ఆచార్య వెలమల సిమ్మన్న సన్మాన సభ ఘనంగా నిర్వహించారు… ముఖ్యఅతిథిగా ఆర్ట్స్ అండ్ కామర్స్ కలశాల ఆచార్యులు జాలాది రవి, రాజనీతి శాస్త్ర విభాగాధిపతి పి. ప్రేమానందం, ఆంగ్ల విభాగాధిపతి సాల్మన్ బెన్నీ, లైబ్రరీ సైన్స్ విభాగాధిపతి ధనరాజ్, హిందీ విభాగాధిపతి ఆచార్య నల్లా సత్యన్నారయణ, మానవ వనరుల నిర్వహణ శాఖాధిపతి ఆచార్య అరుణ్ కుమార్ పాల్గొన్నారు.

ముందుగా సభాధ్యక్షుడు ఆచార్య జర్రా అప్పారావు మాట్లాడుతూ… సిమ్మన్న గురువు వంటి గొప్ప వ్యక్తి మరొకరు లేరని వారిలో సిమ్మన్న ఒకరు అని ఆచార్యులుగా పనిచేస్తూ శతాధిక గ్రంథ రచన చేయడం అసామాన్య విషయం అని అతని ప్రజ్ఞ పాటవాలను తెలిపారు. ఆచార్య గజ్జా యోహాను బాబు మాట్లాడుతూ… పరిశోధన స్థాయి నుండే సిమ్మన్న అందరితో సోదర భావం కలిగి ఉండేవారని నిరంతరం సాహిత్యం చదువుతూ ఎన్నో పుస్తకాలు రాసి తెలుగు సాహిత్యాన్నీ సుసంపన్నం చేశారు అని పేర్కొన్నారు. ఆచార్య ప్రేమానందం మాట్లాడుతూ సిమ్మన్న మాకు మార్గదర్శకులని అని అన్నారు. ఆచార్య బెన్నీ మాట్లాడుతూ సిమ్మన్న పురస్కారానికి అర్హులేనని ఎంతో కఠోర సాధన, త్యాగం లేనిదే ఇన్ని పుస్తకాలు రాయడం సాధ్యం కాదని పేర్కొన్నారు.

ఆర్ట్స్ అండ్ కామర్స్ కలశాల ప్రాచార్యులు జాలాది రవి మాట్లాడుతూ… సిమ్మన్న సాహిత్య సేవ అనిర్వచనీయమైనది అని తెలుగు శాఖలో ఎక్కువ ఫెలోషిప్ లో పొందడానికి సిమ్మన్న పుస్తకాలు విద్యార్థులుకు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. ఆచార్య ధనరాజ్ మాట్లాడుతూ… సిమ్మన్న నడిచే గ్రంథాలయమని తమకి ఆదర్శమని అన్నారు. ఆచార్య నల్లా సత్యన్నారాయణ మాట్లాడుతూ సిమ్మన్న శ్రమ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని ఎందరికో ఉద్యోగాలు రావడంలో ఆయన పుస్తకాలు కీలకమని కొనియాడారు.
ఆచార్య అరుణ్ కుమార్ మాట్లాడుతూ… పుస్తకాలు రాయాలంటే ఓపిక సహనం పట్టుదల కృషి ఉండాలని అవన్నీ కూడా మెండుగా గా ఉన్నాయని అన్నారు. సన్మాన కర్త స్పందనగా ఆచార్య సిమ్మన్న మాట్లాడుతూ… తన జీవితం సాహిత్యమయం అని తన గురువుల యొక్క సూచనలు తనని ప్రభావితం చేశాయి అని, తన క్రమశిక్షణే తనని ఈ స్థాయికి తీసుకొచ్చింది అని తన పుస్తక రచనలో తన సహధర్మచారిని కృషి వలనే ఇదంతా సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు దండు అధ్యక్షుడు పరవస్తు ఫణిశయన సూరి, జాతీయ జర్నలిస్టులు సంఘం కార్యదర్శి.. పరిశోధక విద్యార్థి గంట్ల శ్రీనుబాబు.. డాక్టర్ గిరీష్ కుమార్, డాక్టర్ ఎం. దాసు, డాక్టర్ ఎం ప్రతాప్, డాక్టర్ పి.శ్రీనివాసరావు, డాక్టర్ సూర్యనారాయణ, డాక్టర్ ఎమ్ .కృష్ణవేణి, పరిశోధకులు స్నాతకోత్తర విద్యార్థులు తదితరులు ఘనంగా సత్కరించారు.. పెద్ద ఎత్తున సాహితీవేత్తలు పాల్గొన్నారు.
