అగ్ర పీఠాధిపతి కార్డినల్ పూల ఆంథోనీ బిషప్ ప్రదర్శన..

అగ్ర పీఠాధిపతి కార్డినల్ పూల ఆంథోనీ బిషప్ ప్రదర్శన..

ఆళ్లపళ్లి, ఆంధ్రప్రభ : రోమన్ క్యాథలిక్ మిషన్ హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు, సీబీసీఐ భారతదేశ అధ్యక్షుడు, పరిశుద్ధ పోప్ కార్డినల్ మోస్ట్ రెవరెండ్ ఘనత వహించిన బిషప్ పూల ఆంథోనీ, ఖమ్మం పీఠాధిపతులు బిషప్ డీడీ డాక్టర్ సగిలి ప్రకాష్, విజి తప్పేట శౌరీ, పుణ్యక్షేత్రం డైరెక్టర్ గూండా జ్వానేశ్, ఉమ్మడి ఖమ్మం జ్యోతిర్మయి డైరెక్టర్ ఫాదర్ కాకమాను రాజు, విశ్రాంత బిషప్ మైపన్ పాల్ తండ్రితో పాటు పలువురు సీనియర్ గురువులు కొమ్ము అంతోని, ఎలియాస్, విజయ్, గోవాశరయ్య, ఫ్రాన్సిస్, జోసెఫ్, థామస్, సిద్దేలా జేసు ప్రసాద్ ఎస్జేసి, కూరపాటి యాకోబు, జార్జి, స్లివప్ప, ప్రభాకర్ రెడ్డి, అనిల్, జయానంద్, విజయరావు జరిగే పుణ్యక్షేత్ర మహోత్సవానికి విచ్చేస్తున్న పరిశుద్ధ పాప్ దూత అగ్రపీఠాధిపతులు ఆంథోనీ, డాక్టర్ సగిలి ప్రకాష్ బిషప్ ఆధ్వర్యంలో నూతన కళాజాతర నిర్మాణ నిమిత్తం భూమి పూజ శంకుస్థాపన చేయడం జరిగింది.

అనంతరం పుణ్యక్షేత్రం పురవీధుల గుండా ప్రదర్శన, అనంతరం గురువులకు అసౌకర్యం కలగకుండా సకల సదుపాయాలు, సౌకర్యాలను కల్పించడం జరిగిందని, పోలీస్ సిబ్బంది, జ్యోతిర్మయి యానిమేటర్లు, వాలంటీర్ల ఆధ్వర్యంలో వాహనాల ట్రాఫిక్ నియమ నిబంధనలు తూచా తప్పక అహర్నిషులుగా కృషి చేయడంతో పాటు, కరుణగిరి పుణ్యక్షేత్రానికి ముఖ్యఅతిధులు ఖమ్మం ఎంపీ రఘురామరాజు సహాయం, మున్సిపాలిటీ చైర్మన్, మంత్రి హాజరయ్యారు. ఉమ్మడి ఖమ్మం పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ ఘనత వహించిన బిషప్ తండ్రి డాక్టర్ సగిలి ప్రకాష్ ప్రత్యేక ఘనంగా సన్మానించి సత్కరించారు. వారి సేవలు కొనియాడారు. పుణ్యక్షేత్రం పాదయాత్రకు రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామాలు మొదలుకొని కరుణగిరి మహోత్సవాలకు తండోపతండాలుగా తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో జ్యోతిర్మయి యానిమేటర్ల కోఆర్డినేటర్ శౌరి, యానిమేటర్లు సుందర్రావు, ప్రసాద్, యేసురాజు, చిన్నప్ప, పాస్కాలి, శాంతయ్య, మోహన్రావు, బాబురావు, దేవానందం, బాలస్వామి, యోహాను, ఆంధ్రప్ప,ఆళ్లపల్లి విచారణ జ్యోతిర్మయి యానిమేటర్ పరమ ప్రభాకర్, బ్రదర్స్, సిస్టర్స్, గురువులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply