మన నగరం సుందరంగా పరిశుభ్రంగా ఉండాలి..

మన నగరం సుందరంగా పరిశుభ్రంగా ఉండాలి..
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
కార్పొరేషన్, ఆంధ్రప్రభ : మన నగరం ఎల్లప్పుడూ సుందరంగా, పరిశుభ్రంగా ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ఆదివారం ఉదయం తన పర్యటనలో భాగంగా మహాత్మా గాంధీ రోడ్ పటమట బెంజ్ సర్కిల్ హైవే ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరం సుందరంగా, పరిశుభ్రంగా ఉండాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, రోడ్డుపైన గుంతలు పడితే, వెంటనే ప్యాచ్ వర్క్లు చేయాలని, నగర సుందరీకరణంలో ఏవైనా లోపాలు కనిపించినచో వెంటనే సుందరీకరణ పనులు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని,
నగరం ఎల్లప్పుడు పరిశుభ్రంగా ఉండుటకు పారిశుధ్య నిర్వహణ కచ్చితంగా గేటట్టు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని, రహదారుల్లో అనధికార బ్యానర్లు లేకుండా తొలగిస్తుండాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, సిబ్బంది పాల్గొన్నారు.
