Telangana | ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలి

Telangana | ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలి

పాఠశాల ఎదుట విద్యార్థులతో కలిసి ఆందోళన
విద్యార్థులకు రక్షణ లేక ఇబ్బందులు
పశువులకు అడ్డగా మారినా పాఠశాల గ్రౌండ్
ప్రహరీ గోడ నిర్మించి, గేట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి
బిఆర్ఎస్వీ నియోజకవర్గ ఇంచార్జి లకావత్ చిరంజీవి


Telangana | స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ: స్టేషన్ ఘన్ పూర్ (Station Ghanpur) మునిసిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలో ప్రభుత్వ గిరిజనశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గిరిజన ఆశ్రమ బాలుర ప్రాథమికోన్నత పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడంతో విద్యార్థులు (Students) ఇబ్బందులు పడుతున్నారని బిఆర్ఎస్వీ స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ ఇంచార్జి లకావత్ చిరంజీవి అన్నారు. పాఠశాల ఎదుట విద్యార్థులతో కలిసి ఆందోళన నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా శనివారం వారు మాట్లాడుతూ… ఈ ఏడాది జూన్ మాసంలో ప్రారంభించిన పాఠశాలకు ఇప్పటి వరకు పాఠశాలకు ప్రహరీ లేకపోవడం వలన రాత్రి వేళల్లో ఇతర వ్యక్తులు వస్తున్నారని, పశువులు, మేకలు వస్తున్నాయని దీంతో ఇబ్బందులు పడుతుంటే గిరిజన శాఖ అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు.

ఈ ఏడాదే కదా పాఠశాల ఓపెన్ అయింది ఇప్పుడే ప్రహరీ గోడ రాదని గిరిజన శాఖ అధికారులు (Tribal Department officials) నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. పాఠ శాలలో గ్రౌండ్ లెవెలింగ్ పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కి పనులు అప్పచెప్తే నా మాత్రపు పనులు చేసి చేతులు దులుపుకున్నారని, ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో సదరు కాంట్రాక్టర్ స్పందించడం లేదు, ఫోన్ లిఫ్ట్ చేయటం లేదని ఇంజనీరింగ్ అధికారులు దాటవేస్తున్నారన్నారు. అదేవిధంగా మారుమూల గిరిజన తండాల నుంచి విద్యార్థులు (Students) చదువుకోవాలనే ఆశతో వచ్చారని, కానీ సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడంతో చదువులో వెనుక పడుతున్నారని, అధికారులు వచ్చినప్పుడు విద్యార్థులు చెప్తే ఫోటోలు తీసుకొని ఆ తరువాత మరిచిపోతున్నారని పేర్కొన్నారు.

ఈ పాఠశాల ప్రారంభం ఎమ్మెల్యే (MLA) కృషి ఫలితమేనని, ఇప్పుడు కూడా ఎమ్మెల్యేనే ముందుకు వచ్చి ప్రహరీ గోడ నిర్మాణం, మంజూరు, గ్రౌండ్ లెవెలింగ్ పూర్తి స్తాయిలో పనులు చేయించే విధంగా గిరిజన శాఖ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రహరీ మంజూరయ్యే కృషి చేయాలని కోరారు.