Drones | డ్రోన్లకు దరఖాస్తుల ఆహ్వానం.

Drones | డ్రోన్లకు దరఖాస్తుల ఆహ్వానం.

Drones | దండేపల్లి, ఆంధ్రప్రభ : స‌బ్సిడీ డ్రోన్లకు, మహిళా సంఘాలు, రైతు సంఘాలు, సొసైటీ సంఘాలు దరఖాస్తులు చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి గొర్ల అంజిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 40% రాయితీ మీద గరిష్టంగా నాలుగు లక్షల వరకు సబ్సిడీతో వ్యవసాయ డ్రోన్లు పంపిణీ చేస్తుందన్నారు.

దగ్గరలోని వ్యవసాయ విస్తరణ అధికారిని గాని లేదా మండల వ్యవసాయ అధికారులు గాని నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు. దరఖాస్తు ఫారం, డ్రోన్ కొటేషన్, సంగం డ్రోన్ కొనుటకు తీర్మానం సంఘం రిజిస్ట్రేషన్, ఎకౌంట్ స్టేట్మెంట్ నకలు, సంఘం కనిష్ట అనుభవం కొరకు తీసుకోవడం జరుగుతున్నదన్నారు. దీనికి పిఎసిఎస్ సొసైటీలకు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు మాత్రమే అర్హులని పేర్కొన్నారు.

Leave a Reply