మొబైల్ మెడికల్ క్యాంపు..

మొబైల్ మెడికల్ క్యాంపు..

  • పశ్చిమ నియోజకవర్గం లో
  • సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో..

భవానిపురం ఆంధ్రప్రభ : ఈనెల 28, మార్చి 1 తేదీల్లో పశ్చిమ నియోజకవర్గ పరిధిలో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొబైల్ మెడికల్ వ్యాన్ల ద్వారా ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు.. ఈనెల 28 వ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు కొత్తపేటలోని పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాలలో 48, 49 డివిజన్లలోని ప్రైజర్ పేట, టైలర్ పేట, జోడు బొమ్మల సెంటర్, తదితర ప్రాంతాల ప్రజలు ఈ ఉచిత మొబైల్ మెడికల్ క్యాంప్ ద్వారా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వైద్య పరీక్షలు, చికిత్స పొందవచ్చని తెలిపారు..

ఈ క్యాంపులో వివిధ విభాగాల సీనియర్ వైద్యుల కన్సల్టేషన్ తో పాటు ఈసీజీ, ఎక్స్ రే, 2డీ ఎకో , కంటి పరీక్షలు, దంత పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు . పరీక్షల అనంతరం ఆయా వ్యాధులకు సంబంధించిన మందులు కూడా ఉచితంగా అంద చేస్తారని తెలిపారు. అదే విధంగా మార్చి 1వ తేదీ ఆదివారం కేబీఎన్ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి మొబైల్ వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.. 38 , 51, 52 డివిజన్ల పరిధిలోని మల్లిఖార్జునపేట, హెడ్ వాటర్ వర్క్స్, కుమ్మరిపాలెం, గుప్తా సెంటర్, అర్జున్ వీధి, ఆంజనేయ వాగు సెంటర్ తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించు కోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave a Reply