ఉపాధ్యాయుడు మృతి

ఉపాధ్యాయుడు మృతి
బలిలాం పార్థివదేహానికి నివాళులర్పిస్తున్న నాయకులు
అనారోగ్యంతో మృతి చెందిన ఉపాధ్యాయుడు బలి రామ్
మృతి పట్ల ఉపాధ్యాయ సంఘాల నాయకుల ప్రగాడ సంతాపం
ఉట్నూర్, ఆంధ్రప్రభః అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కేబి కాంప్లెక్స్ లోని స్పోర్ట్స్ స్కూల్ పనిచేస్తున్న ఉపాధ్యాయుడు, టి పి టి ఎఫ్ జిల్లా నాయకులు ఆత్రం బలి రామ్ ( 56) అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఉట్నూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఉత్తం రాథోడ్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు జాదవ్ రవీందర్ తెలిపారు. ఆయన గత కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడని వైద్యం చికిత్సలు చేసిన నయం కాలేదని వారు పేర్కొన్నారు. ఆయన అంత్యక్రియలు మధ్యాహ్నం తర్వాత మండలంలోని బీస్సాయిపేట్ లో గల తన పంట భూమిలో నిర్వహించారు.
ఈ అంత్యక్రియల్లో టి పి టి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వెడుమ శ్యామ్ రావు, రాష్ట్ర కౌన్సిలర్ జ్ఞానేశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి గేడం చంద్రకాంత్, ప్రధాన్ పురోహిత్ సంఘ నాయకులు లక్ష్మణ్, కృష్ణ, యశ్వంతరావు, రామచందర్, అంకుష్, ఉపాధ్యాయ సంఘ నాయకులు ఉపాధ్యాయులు బంధుమిత్రులు పాల్గొని సాంప్రదాయ నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనారోగ్యంతో ఉపాధ్యాయుడు ఆత్రం బలిరాం మృతి చెందడం బాధాకరమని వారు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతున్ని ప్రార్ధించినట్లు వారు తెలిపారు.

