Former Minister | కేటీఆర్ హామీ..

Former Minister | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ ; ఖమ్మం జిల్లా వెలుగుమట్టలో మాజీ మంత్రి కేటీఆర్ భూదాన్ బాధితులను కలిసి పరామర్శించారు. ఇళ్లు కూలగొట్టిన చోటే గృహప్రవేశం చేయిస్తానని వారికి హామీ ఇచ్చారు. అందరం ఐక్యంగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేద్దామని స్పష్టం చేశారు. భూదాన్ బాధితుల సమస్యలను జిల్లా కలెక్టర్, సీఎస్ ని కలుస్తాం, అసెంబ్లీలో కూడా ప్రస్తావిస్తామన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టు వెళ్తామని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
దేశంలో అప్పుడు ఒరిజినల్ గాంధీ ఉండేవారు. ఇప్పుడు డూప్లికేట్ గాంధీలు ఉన్నారని కేటీఆర్ విమర్శించారు. జిల్లా మంత్రులు మాయగాళ్లు. చిచ్చు పెడుతున్నారని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భూదాన్ ఇళ్ల కూల్చివేత పాపం ఆ ముగ్గురు మంత్రులకే చెందుతుంది. అక్రమ సంపాదన కోసం భూదాన్ భూములపై కన్నేశారని కేటీఆర్ ఆరోపించారు.
