వ్యవసాయ యాంత్రీకరణ పథకం లక్ష్యం అదే..

వ్యవసాయ యాంత్రీకరణ పథకం లక్ష్యం అదే..
హసన్ పర్తి, ఆంధ్రప్రభ : రైతుల ఉత్పాదక శక్తిని పెంచడమే లక్ష్యంగా వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అమలు చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ ఏడిఏ ఆదిరెడ్డి అన్నారు. హసన్ పర్తి మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా సబ్సిడీ పై ఎల్లాపూర్, జయగిరి, గంటూర్ పల్లికి చెందిన రైతులు గోలి బాగ్యమ్మ, ఆలేటి కుమారస్వామి, వర్ణ సుధాకర్ రెడ్డిలకు రోటోవేటర్లు, ఆలిగే వీసం రాంచంద్రారెడ్డీకి కల్టివేటర్ పంపిణీ చేశారు. అనంతరం మండల వ్యవసాయ అధికారి అనురాధ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఏడీఏ మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని ఆధునికరించడంతో యాంత్రీకరణ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలు సబ్సిడీ పై అందించడం మూలంగా వ్యవసాయ ఖర్చులు తగ్గి దిగుబడులు పెరుగుతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి, జయగిరి, గంటూర్ పల్లి గ్రామాల సర్పంచ్ లు వెంకటేశ్వర్లు, రాకేష్ రెడ్డి, హసన్ పర్తి మండల ఎంఆర్ఓ పూజారి కిరణ్ కుమార్, ఎంపీడీఓ సుమన వాణి, ఎఈఓలు ప్రవళిక, సుమన్, శైలజ, భాస్కర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పోరెడ్డి మహేందర్ రెడ్ది, కాంగ్రెస్ నాయకులు కనపర్తి కిరణ్, బిగుళ్ల సురేష్, వీసం సురేందర్ రెడ్ది, గరిగె రాజు, జన్ను రవి తదితరులు పాల్గొన్నారు.
