Mother&Daughter | చదువుకో లేదా ఉద్యోగం కోసం వెళ్లే ఆడపిల్లకు తల్లి బొట్టు పెట్టి పంపొచ్చా? శాస్త్రం చెప్పిన నిజం

Mother&Daughter |చదువు లేదా ఉద్యోగం కోసం దూరం వెళ్లే కూతురికి తల్లి బొట్టు పెట్టడం శాస్త్రోక్తమా?

Mother&Daughter | శాస్త్రం ఏం చెబుతోంది? కుంకుమ మహిమ
పురాణాల్లో ఉన్న ఉదాహరణ – పార్వతీదేవి కథ
బొట్టు పెట్టి పంపితే పెళ్లి చేసి పంపినట్టేనా?
తల్లి ఆశీర్వాదం – కూతురికి ధైర్యం
అపోహలు వదిలి ఆచారాన్ని అర్థం చేసుకుందాం

Mother&Daughter | మన ఇళ్లలో తల్లులకు తరచుగా వచ్చే సందేహం ఇది.

పెళ్లయిన ఆడపిల్లను అత్తగారింటికి పంపేటప్పుడు తల్లి బొట్టు పెట్టి పంపడం మన ఆచారం. మరి పెళ్లి కాని ఆడపిల్ల చదువుల కోసమో, ఉద్యోగం కోసమో హాస్టల్ కో, వేరే ఊరికో వెళ్తున్నప్పుడు తల్లి స్వయంగా బొట్టు పెట్టి పంపొచ్చా? అలా పంపితే పెళ్లి చేసి పంపేసినట్టేనా అని చాలామంది తల్లులు భయపడుతుంటారు.

దీనికి మన పురాణాలు, ధర్మశాస్త్రాలు ఏం చెబుతున్నాయో చూద్దాం. శాస్త్రం ఏం చెబుతోంది?

Mother&Daughter
Mother&Daughter

ఆడపిల్ల అంటేనే సాక్షాత్తూ బాలా త్రిపురసుందరి స్వరూపం.

శ్లోకం: కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదమ్ |

తస్మాత్ తత్ ధారయేత్ ప్రాజ్ఞః శాంతి పుష్టి వివర్ధనమ్ ||

అర్థం: కుంకుమ ఎప్పుడూ మంచి చేస్తుంది. దాన్ని పెట్టుకుంటే మనశ్శాంతి, ధైర్యం, రక్షణ కలుగుతాయి.

వేరే ఊరికి వెళ్లేటప్పుడు తల్లి కూతురి నుదుట బొట్టు పెట్టడం అంటే, కేవలం ఒక ఆచారం కాదు. తన బిడ్డకు ప్రయాణంలో ఎలాంటి ఆటంకాలూ రాకూడదని, వెళ్లిన పని సక్సెస్ అవ్వాలని తల్లి వేసే “శ్రీరామరక్ష”.

పురాణాల్లో ఉందా? దీనికి శివపురాణంలో ఒక చక్కటి ఉదాహరణ ఉంది.

పార్వతీదేవికి అప్పటికి ఇంకా పెళ్లి కాలేదు. శివుడిని భర్తగా పొందాలని, కఠోర తపస్సు చేయడానికి హిమాలయాల్లోని మంచు కొండలకు వెళ్లాలనుకుంటుంది.

అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు అలా ఒంటరిగా అడవులకు వెళ్తుంటే తల్లి మేనకా దేవికి గుండె తరుక్కుపోతుంది.

ఏడ్చుకుంటూ వద్దు అంటుంది (అందుకే ఆమెకు ‘ఉ-మా’ అని పేరొచ్చింది). కానీ కూతురి పట్టుదల చూసి తండ్రి హిమవంతుడు సర్దిచెబుతాడు. అప్పుడు మేనకా దేవి తన బాధను దిగమింగుకుని, సంతోషంగా కూతురి నుదుట కుంకుమ దిద్ది, అక్షతలు వేసి “నీ సంకల్పం నెరవేరుతుంది తల్లి” అని ఆశీర్వదించి మరీ పంపుతుంది.

ఆ తల్లి పెట్టిన బొట్టు, ఆ దీవెన బలం వల్లే కదా పార్వతీదేవి తపస్సు ఫలించింది!

అపోహలు వద్దు మన తల్లులకు ఉండే భయం ఏంటంటే… బొట్టు పెట్టి సాగనంపితే, అత్తవారింటికి పంపేసిన ఫీలింగ్ వస్తుందని. ఎక్కడ దూరం అయిపోతుందో అన్న సెంటిమెంట్ తో భయపడతారు.

కానీ అది ఒట్టి అపోహ మాత్రమే. బొట్టు పెట్టి పంపడం అంటే వదిలేసుకోవడం కాదు, దేవుడి బలాన్ని తోడుగా పంపడం. ఒంటరిగా వెళ్తున్న ఆడపిల్లకు “మా అమ్మ ఆశీర్వాదం నా వెంటే ఉంది” అనే గొప్ప ధైర్యాన్ని ఆ బొట్టు ఇస్తుంది.

కాబట్టి, పెళ్లి కాని ఆడపిల్ల వేరే ఊరికి వెళ్తున్నప్పుడు తల్లులు ఎలాంటి భయాలు, సెంటిమెంట్లు పెట్టుకోకండి.

సంతోషంగా, నవ్వుతూ నుదుటన కుంకుమ పెట్టి పంపండి. కంట్లో నీళ్లు తిరగకూడదు.

“వెళ్లి రా తల్లీ, అంతా మంచే జరుగుతుంది” అని దీవించి పంపితే చాలు…

ఆ బిడ్డే రేపు విజయం సాధించి మీ ఇంటికి గర్వకారణంగా తిరిగి వస్తుంది.

జల్లవరపు సాయి ధీరజ్ శర్మ,

జ్యోతిష పండితులు & పురోహితులు

మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

click here for more

Leave a Reply