ఎస్సీ, ఎస్టీలపై దాడులను సహించం..

ఎస్సీ, ఎస్టీలపై దాడులను సహించం..
నాగర్ కర్నూల్ జిల్లా, ఆంధ్ర ప్రభః కలెక్టరేట్ లో నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర బాధితులను ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కమిషన్ సభ్యులు జిల్లా శంకర్ పరామర్శించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించినా సంబంధిత అధికారులపై తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సీ, ఎస్టీలపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ హెచ్చరించారు.
నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ లోని స్టేట్ చాంబర్ల్ లో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ఇతర పోలీస్ అధికారులతో కలిసి ఘటనకు సంబంధించిన పూర్వాపరాలు, కేసు నమోదు ప్రక్రియ, బాధ్యులపై తీసుకుంటున్న చర్యలు, బాధితులకు అందిస్తున్న వైద్య సహాయం వంటి అంశాలపై అధికారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. చిన్నారి తల్లిదండ్రులు గణేష్, మౌనిక కుటుంబ సభ్యులతో ఘటన పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అన్ని విధాలుగా హామీ ఉంటామని, నిందితులకు కఠిన శిక్షలు అమలు జరిగే వరకు ఎస్సీ ఎస్టీ కమిషన్ బాధ్యతల పక్షాన నిలుస్తుందని, బాధితులకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, అలాగే దర్యాప్తును వేగవంతం చేసి, బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీను ఆదేశించారు.

Scheduled Castes and Scheduled Tribes (Prevention of Atrocities) Act, 1989 చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్పే ర్కొన్నారు. బాధితులకు తక్షణ న్యాయం అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు, కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని సూచించారు. సమాజంలో సమానత్వం, భద్రత కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని, ఎస్సీ, ఎస్టీల హక్కులను రక్షించడంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.
కుమ్మెర ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర్ రాజనర్సింహ తో మాట్లాడి బాధ్యతలకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని, కుమ్మెర కేసును త్వరగా పరిష్కరించేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి, బాధ్యతలకు సత్వర న్యాయం అందించే దిశగా ఎస్సీ ఎస్టీ కమిషన్ కృషి చేస్తుందని ఆయన తెలిపారు.

కుమ్మెర బాధితులకు తక్షణ ఖర్చుల నిమిత్తం గణేష్, మౌనికలకు లక్ష రూపాయల చెక్కును అందజేశారు. అలాగే వచ్చే మూడు నెలల పాటు వారికి నిత్యవసర సరుకులు నిరంతరంగా అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశించారు. నిందితులపై హత్య కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ కేసు బుక్ చేయాలని జిల్లా ఎస్పీకి సూచించారు. బాధ్యులు కుమ్మర గ్రామంలో వెళ్లడానికి ప్రాణహాని ఉంటుందని వారు భయంతో ఉన్నారని, నాగర్ కర్నూల్ లోని డబల్ బెడ్ రూమ్ ఏర్పాటు చేసి గణేష్ కు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.
పోలీసులు పోలీస్ స్టేషన్కు ఏదైనా సమస్యపై వచ్చే ఎస్సీ, ఎస్టీ బాధితులకు పూర్తిస్థాయి రక్షణ కల్పిస్తూ, వారికి సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని, వారి ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యతతో స్వీకరించి, ఆలస్యం లేకుండా కేసులు నమోదు చేసి, చట్టపరమైన విధానాలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. అలాగే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారికి భద్రతాభావం కల్పించడం పోలీసుల ముఖ్య బాధ్యత అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రెవిన్యూ, పోలీస్ శాఖల అధికారులు వివిధ సంఘాల కుల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
