TG | సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు !

సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ మేర‌కు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *