TG | మానవ వనరుల అభివృద్ధి కేంద్రం వైస్ ఛైర్ ప‌ర్స‌న్ గా శాంతి కుమారి

హైద‌రాబాద్ – మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం వైస్ చైర్ పర్సన్ గా సీనియర్ ఐఎఎస్ అధికారిణి శాంతికుమారిని నియమించారు.. ప్రస్తుతం ఆమె రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు.. ఆమె ఈ నెల 30 వ తేదిన పదవీ విరమణ చేయనున్నారు.. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఎంసిఆర్ హెచ్ ఆర్టీ వైస్ ఛైర్మ‌న్ గా నియ‌మిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.. ఆమె నియామ‌కం మే ఒక‌టో తేది నుంచి అమ‌లులోకి వ‌స్తుంద‌ని పేర్కొంది.. కాగా కొత్త ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా రామ‌కృష్ణారావును ప్ర‌భుత్వం నియ‌మించింది.. ఆయ‌న కూడా మే ఒక‌టో తేదిన రాష్ట్ర చీఫ్ సెక్ర‌ట్రీగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు.

Leave a Reply