BRS Meeting | లక్ష‌ల సంఖ్య‌లో హాజ‌రై స‌భ‌ను స‌క్సెస్ చేసిన అందరికీ ధ‌న్యవాదాలు – కెటిఆర్

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్రంపై, మాజీ సీఎం కేసీఆర్ పై అచంచల విశ్వాసాన్ని చూపిస్తూ.. అపూర్వమైన సంఖ్యలో ఎల్క‌తుర్తికి హాజరై బిఆర్ఎస్ సిల్వ‌ర్ జూబ్లీ స‌భ‌ను విజ‌య‌వంతం చేసినందుకు అంద‌రికీ ద‌న్య‌వాదాలు తెలిపారు బిఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ . ఈ మేర‌కు ఆయ‌న త‌న ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దేశ చరిత్రలో అతిపెద్ద రాజకీయ సమావేశాలలో ఒకటైన బీఆర్ఎస్ రజతోత్సవ సమావేశాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసి, ఎటువంటి లోపాలు లేకుండా నిర్వ‌హించామన్నారు.

రాష్ట్ర పోలీసుల ట్రాఫిక్ నిర్వహణ లోపం కారణంగా లక్షలాది మంది వేదిక వద్దకు చేరుకోలేకపోయార‌ని అన్నారు.. అయినప్ప‌టికీ , బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు త‌మ‌ శక్తిని ఈ సమావేశంలో ద్వారా నిరూపించామ‌న్నారు… ఈ కార్యక్రమాన్ని నిజంగా చారిత్రాత్మకమైనదిగా, అద్భుతమైన విజయంగా మార్చినందుకు తెలంగాణ ప్రజలు, నిర్వాహకులు, బిఆర్ ఎస్ నాయకులు, క్యాడర్, సోషల్ మీడియా యోధులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు కెటిఆర్ . అద్భుతమైన కవరేజ్ ఇచ్చిన మీడియా సోదరులకు ప్ర‌త్యేక ధన్యవాదాలు చెప్పారు.

Leave a Reply