విషయపరంగా మెలకువలు పాటించాలి

విషయపరంగా మెలకువలు పాటించాలి
- ఎంఈవో అబ్దుల్ రహీం
ఊర్కొండ, ఆంధ్రప్రభ : విషయపరంగా మేలకువలు పాటిస్తే విజయాల పరంపర కొనసాగుతుందని ఎంఈఓ అబ్దుల్ రహీం అన్నారు. శనివారం మండలంలోని ఊరుకొండపేట జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలో పి టి ఏ సమావేశం ప్రధానోపాధ్యాయులు ఇన్చార్జి ఎంఈఓ అబ్దుల్ రహీం అధ్యక్షతన కొనసాగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలపై చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, విద్యార్థులందరూ పాఠశాలకు హాజరయ్యేలా తల్లిదండ్రులు చూసుకోవాలన్నారు.
అదేవిధంగా విద్యార్థులకు ఫోన్ లు ఇవ్వరాదని, ఇంటికి వచ్చిన విద్యార్థులకు చదువుపై ధ్యాస ఉండే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులపై ఉందని తెలిపారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు, వారి తల్లిదండ్రులు మార్గదర్శనము చేసినప్పుడే వారు ఉన్నత స్థితికి చేరుకుంటారని, విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయుల పాత్ర ఎంత ఉంటుందో తల్లిదండ్రుల పాత్ర అంతకంటే ఎక్కువ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
