కోతుల పారద్రోలేందుకు ఎలుగుబంటి అవతారం

కోతుల పారద్రోలేందుకు ఎలుగుబంటి అవతారం
- రాంరెడ్డిపల్లి సర్పంచ్ వినూత్న ప్రయోగం
మర్రిగూడ, ఆంధ్ర్రప్రభ ; మండలం రాంరెడ్డిపల్లి గ్రామంలో కోతుల బెడదను వదిలించుకోవడానికి సర్పంచ్ లపంగి నర్సింహా ఒక వింతైన,ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నారు.గ్రామంలో కోతుల అల్లరి మితిమీరిపోవడంతో,వాటిని భయపెట్టి పారద్రోలేందుకు ఆయన ఎలుగుబంటి వేషధారణను ఆశ్రయించారు.గత కొంతకాలంగా రాంరెడ్డిపల్లిలో కోతుల గుంపులు ఇళ్లపై పడి ఆహార పదార్ధాలను ఎత్తుకెళ్లడమే కాకుండా,గ్రామస్థులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి.ఎన్ని ప్రయత్నాలు చేసినా కోతులు గ్రామాన్ని వదిలి వెళ్లకపోవడంతో ఒక వినూత్న ఆలోచన చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నక్క వెంకటయ్య,కడారి ఎర్రయ్య, బలుసుల మల్లయ్య, కారింగు సాంబయ్య,ఎడ్ల యాదయ్య,ఏపూరు ముత్తయ్య, లపంగి నర్సింహా తదితరులు పాల్గొన్నారు.
