ఆ నలుగురు ఒకే వార్డు ఓటర్లు

భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ : భీంగల్ మున్సిపల్ రెండో విడుత సాధారణ ఎన్నికల్లో వివిధ పార్టీల నుండి కౌన్సిలర్ స్థానాలకు పోటీ చేసి విజయం సాధించిన అభ్యర్థులు నలుగురు ఒకే వార్డు ఓటర్లుగా ఉన్నారు. ఈ విశేషం భీంగల్ మున్సిపల్ ఎన్నికల్లో చోటు చేసుకుంది. మున్సిపల్ కౌన్సిలర్లు గా అధికార పార్టీ నుండి ఆరో వార్డు నుండి పోటీ చేసిన బోదిరే నాగమణి, బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసిన తొమ్మిదో వార్డు అభ్యర్థి నీలం రవి, ఐదో వార్డు నుండి పోటీ చేసిన బోదిరే లావణ్య, నాలుగో వార్డు నుండి పోటీ చేసిన గున్నాల బాల లక్మీ లు కౌన్సిలర్లు గా విజయం సాధించారు. అయితే విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తో పాటు బీఆర్ఎస్ పార్టీ కి చెందిన ముగ్గురు అభ్యర్థుల ఓట్లు మాత్రం ఒకే వార్డు ( ఐదో వార్డు ) లో ఉండడం విశేషం. పార్టీ లు వేరు అయినప్పటికీ ఒకే కాలనీ కి చెందిన నలుగురు అభ్యర్థులు విజయం సాధించడం పట్ల కాలనీ ( ఐదో వార్డు ) వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply