Kuravi | భక్తుల కోర్కెలను తీర్చే క్షేత్ర మహత్మ్యం

Kuravi | భక్తుల కోర్కెలను తీర్చే క్షేత్ర మహత్మ్యం

Kuravi | కురవిలో శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధం
మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక దర్శన ఏర్పాట్లు
కల్యాణ మహోత్సవం పూర్తి కార్యక్రమాల వివరాలు
తెప్పోత్సవం, రథోత్సవం, దోపోత్సవం ప్రత్యేక ఆకర్షణలు
కురవి క్షేత్ర స్థల పురాణం – చాళుక్యుల కాలం నాటి వైభవం
శ్రీ వీరభద్ర స్వామివారి విగ్రహ విశేషాలు
శ్రీ భద్రకాళి అమ్మవారి మహిమ

కురవి, ఆంధ్రప్రభ : ఉమ్మడి వరంగల్ జిల్లాకు 70 కిలోమీటర్ల దూరంలో నూతన మహబూబాద్ జిల్లాకు పది కిలోమీటర్ల దూరంలో గిరిజన ఆరాధ్య దైవంగా సంతాన సఫల్య దైవంగా భూత బ్రేత పిశాచాలకు అధిపతిగా కొరివి మండల కేంద్రంలో కొలువై ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి కళ్యాణ మహోత్సవము కార్యక్రమానికి సర్వం సిద్ధం అని ఆలయ కార్యనిర్వాహనధికారి శ్రావణపు సత్యనారాయణ తెలిపారు. దేవదాయ ధర్మాదాయశాఖ ఆదేశాల మేరకు వివిధ దేవాలయాల్లో పనిచేస్తున్న అధిక సిబ్బందితో భక్తులకు ఎలాంటి ఆసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ప్రత్యేక దర్శనంకు ప్రత్యేక ఏర్పాటు చేసి సర్వదర్శనానికి ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.భారీ పోలీస్ భాదోబస్తూ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

కల్యాణ మహోత్సవ కార్యక్రమముల వివరాలు:

Kuravi

14-2-2026 శనివారం ఉ॥ గం|| 9-00 లకు పసుపు, కుంకుమలు పంచగవ్యప్రాశన”, కంకణధారణ, దీక్షాధారణ, అంకురారోపణం, అఖండ దీపారధన, కలశస్థాపన, అగ్ని ప్రతిష్ఠాపన, ధ్వజారోహణం. రాత్రి గం|| 10-00లకు బసవముద్ద, 15-2-2026 ఆదివారం మహాశివరాత్రి ఉ॥ గం|| 4-00ల నుండి శ్రీ స్వామివారి దర్శనము. ఉ॥ గం|| 4-00 ల నుండి సా|| గం॥ 4-00ల వరకు శ్రీస్వామివారికి పూర్ణాభిషేకం,సా|| గం|| 4-00ల నుండి శ్రీ స్వామివారు ఆలంకారముతో దర్శనము, పాదభిషేకము,శివాలయము నందు ఉ॥ గం|| 5-00ల నుండి రాత్రి గం|| 12-00ల వరకు శ్రీ పార్వతి రామలింగేశ్వరస్వామివారికిఅభిషేకములు నిర్వహించబడును. సా|| గం|| 7-00 లకు గ్రామసేవ, ఎదురుకోలు,రాత్రి గం|| 01-50 ని॥లకు (తెల్లవారితే సోమవారం) శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వారి కళ్యాణమహోత్సవము. 16-2-2026 సోమవారం నుండి తేది 17-2-2026 మంగళవారం వరకు ప్రతి నిత్యము ఉ॥ గం|| 6-00 లకు అభిషేకములు, నిత్యౌపాసన, బలిహరణ. సా|| గం|| 6-00 లకు హోమము, సేవలు, గ్రామసేవ.

18-2-2026 బుధవారం

ఉ॥ గం||6-00లకు నుండి 12-00 గంటల వరకు అభిషేకములు సా|| గం||6-30 లకు తెప్పోత్సవము (కురవి పెద్ద చెఱువు నందు)

20-2-2026 శుక్రవారం

ఉ|| గం|| 6-00 లకు అభిషేకములు, నిత్యౌపాసన, బలిహరణ. సా|| గం|| 6-00 లకు రథోత్సవము.

21-2-2026 శనివారం

ఉ॥ గం|| 6-00 లకు అభిషేకములు, నిత్యౌపాసన.ఉ॥ గం॥ 10-30 ని॥లకు పూర్ణాహుతి.
సా|| గం|| 4-00 లకు బండ్లు తిరుగుట, పారువేట.రాత్రి గం|| 10-00లకు ద్వజ అవరోహణ, బసవముద్ద.

22-2-2026 ఆదివారం

తెల్లవారుజామున గం|| 5-00 లకు దోపోత్సవము. ఉ॥ గం|| 8-00 లకు వసంతోత్సవము,ఉ॥ గం|| 11-00 లకు కురవి పెద్ద చెరువునందు త్రిశూలస్థానం. సాయంత్రం గం|| 7-00 లకు ఏకాంత సేవ, సదస్యం నాగవెల్లి.

23-2-2026 సోమవారం

ఉ|| గం|| 6-00 ల నుండి మ॥ గం॥ 12-00ల వరకు అభిషేకములు.సా॥ గం|| 6-30ని॥లకు శ్రీ స్వామివారి పవళింపు సేవ.

27-2-2026 శుక్రవారం

ఉ॥ గం॥ 7-00 లకు శివాలయములో మహన్యాస పూర్వక రుద్రాభిషేకము, రుద్రహోమము. ఉ గం॥ 11-30 లకు శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వరస్వామి వారి కళ్యాణమహోత్సవము

01-3-2026 ఆదివారం

ఉ॥ గం॥ 6-00ల నుండి గం॥ 12-00ల వరకు పూర్ణాభిషేకములు మ॥ గం॥ 12-00ల నుండి శ్రీస్వామివారి ఆలంకరణ.
పదహారు రోజుల పండుగతో స్వామివారి కల్యాణ మహోత్సవ కార్యక్రమలు ముగుస్తాయి.

స్థల పురాణము క్షేత్ర మహత్యము

Kuravi

మహబూబాబాద్ జిల్లా కేంద్రమునకు 9కి.మీ. దూరమున పుర్వపు వరంగల్ జిల్లా కేంద్రమునకు 70కి.మీ. రైలు మర్గమున దూరమున మహబూబాబాద్- మరిపెడ జాతీయ రహదారి మార్గములో పెద్ద తటాకమునానుకొని కురవి మండల కేంద్రము నందు క్రీ.శ. 850 ప్రాంతములో వేంగిరాజధానిగా చేసుకొని పాలించు చాళుక్యుల సామంతులైన రాష్ట్రకూట రాజైన భీమరాజు ఈ కురవి (కురవి అనగా గోరింటాకు లేదా ఎరుపు అని అర్ధము) నగరమును రాజధానిగా చేసికొని పాలించుచున్న కాలములో శ్రీ వీరభద్రస్వామివారి ఆలయము నిర్మించినట్లుగా చారిత్రక ప్రతీతి. తదనంతరము కాకతీయ తొలి స్వతంత్ర రాజైన ఒకటవ బేతరాజు జీర్ణోద్ధరణగావించినట్లు ఆతర్వాత రెండవ బేతరాజు ఈ కురవి నగరమునకు ఆనుకొనియున్న పెద్ద తటాకమును త్రవ్వించినట్లు తెలియుచున్నది.

Kuravi

సకలశక్తిమూర్తి వరాల ప్రదాత అయిన శ్రీ వీరభద్రస్వామివారు పడమటముఖుడై దశహస్తుడై త్రినేత్రుడై రౌద్రపరాక్రమములతో విలసిల్లుతూ దక్షిణహస్తములలో ఒకటవ హస్తములో ఖడ్గము, రెండవ హస్తములో త్రిశూలము మూడవ హస్తములో పుష్పము. నాల్గువ హస్తములో గద మరియు ఐదవ హస్తములో దండము మరియు వామ హస్తములందు ఒకటవ హస్తములో ఢమరుకము, రెండవ హస్తములో సర్పము, మూడవ హస్తములో విల్లు. నాల్గువ హస్తములో బాణము మరియు ఐదవ హస్తములో ముద్గరము ధరించి భక్తుల పాలిటకల్పతరువుగా, పిలిచిన పలికే దైవముగా వెలుగొందుచున్నాడు.

సమస్తములైన భూత, ప్రేత, పిశాచ, గణాలు, శాకినీ, ఢాకినీ, కామినీ. వంటి ప్రమధ గణ పిశాచాలు ఈయన ఆధీనము. రుద్రగణాలు: ఈయనను సేవిస్తాయి. భక్తులకు విపత్కర సమయంలో దిక్కుతోచని పరిస్థితిలో భక్తులను ఆదుకొనే పరమభోళామూర్తి, సమస్త క్షుద్రగణాలకు వీరభద్రుడంటే పరమ భయం. స్వామిని తలంచిన వారికి, సేవించిన వారికి పిశాచ బాధలు, సర్వదోషాలు, క్షుద్ర శక్తులు దరిజేరవు. శ్రీ స్వామివారి కుడివైపు కొద్ది సమీపములో విజయగణపతి వెలసియున్నాడు. శ్రీ స్వామివారి పాదముల క్రింద సందీశ్వరుడు శ్రీ స్వామివారి వాహనముగా వెలసియున్నారు. శ్రీ వీరభద్రస్వామివారి ఆయుధం పేరు పట్టేశం.

Kuravi

శ్రీ స్వామివారికి ఎడమవైపు చతుర్భుజములు కలిగి శ్రీ భద్రకాళీ అమ్మవారు. వెలసియున్నారు. శ్రీ భద్రకాళీ అమ్మవారికి కుడివైపు మొదటి హస్తమున త్రిశూలం, రెండవ హస్తములో స్వల్పసిద్ధితో హృదయాన్ని స్పందింపచేయునట్లుగా లేదా అభయమిస్తూ వామహస్తములలో మొదటి హస్తములో పద్మము, రెండవ హస్తముతో భునిని శాశ్వతముగా నిలువుమని ఆశీర్వదించినట్లు దర్శినమిచ్చుచున్నది. శ్రీ స్వామివారి మండవములో సమాంతరముగా ఇరువైపుల వరమశివుడు (లింగాకారములో) వెలసియున్నాడు. మండపములో దక్షిణ బాగమున సప్తమాతృకలు వెలసియున్నారు.

ఈ ఆలయమునకు దక్షిణ దిశలో ప్రాకారము బయట శ్రీ భద్రకాళీ అమ్మవారు, స్వయంవ్యక్తమూర్తిగా వెలసి భక్తుల కోర్కెలను తీర్చి అనేక పూజలందుకొనుచున్నది.మహాకాళి భద్రకాళి అమ్మవారు భక్తులు కోరిన కోర్కెలాను తీర్చి పిశాచా పిడాలని తరిమికొడుతుందని ప్రతీక.
॥ భైరవాది భిరాచార్యైః సత్కృతాయ మహాత్మనే।। భక్తానాం పరిపాలయ వీరభద్రాయ మంగళమ్॥ నిత్యం ఈ మంత్రం ప్రతి ఇంట్లో ఆనందశోభ విరాజిల్లుతుంది.

Leave a Reply