18వ వార్డులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు దిశగా ప్రచారం

18వ వార్డులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు దిశగా ప్రచారం

  • అభ్యర్థి రేగూరి కరుణ విజయపాల్ రెడ్డి ఇంటింటి ప్రచారం

పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రేగూరి కరుణ విజయపాల్ రెడ్డి గెలుపు దిశగా ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి రేగూరి కరుణ విజయపాల్‌రెడ్డి వార్డులో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డులోని ఓటర్లు బిఆర్ఎస్ అభ్యర్థికే మద్దతు తెలుపుతున్నారని, 18 వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని అభ్యర్థి కరుణ విజయపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరకాల మున్సిపాలిటీ ఎంతో అభివృద్ధి చేశారని, పట్టణంలో వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాల భవనాలు నిర్మాణం చేశారని అన్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను గుర్తుచేస్తూ ప్రచారం నిర్వహించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో 18 వ వార్డులో కరుణ విజయపాల్‌రెడ్డిని గెలవడం ఖాయమని ఓటర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply