Donors | శ్రీశైల మకరత దేవాలయ నిర్మాణానికి సహకరించండి

Donors | ఊట్కూర్, ఆంధ్రప్రభ : శ్రీశైల మకరత లింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చి సహకరించాలని మల్లేపల్లి సర్పంచ్ సత్యారం కథలప్ప, ధర్మ యువసేన అధ్యక్షులు ధర్మరారాజ్ కోరారు. ఈ రోజు నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని మల్లేపల్లిలో శ్రీ శ్రీశైల మకరత లింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి రూ. 101116 నగదు శివ స్వాములకు అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది శ్రీశైలం మల్లికార్జున స్వామి శివమాలధారణ చేపట్టి స్వాములు గ్రామంలో దైవభక్తి ఆధ్యాత్మికత పెంపొందిస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ దైవభక్తి అలవర్చుకోవడం వల్ల ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటారని అన్నారు. శివ స్వాములు మల్లేపల్లి గ్రామంలో శ్రీ శ్రీశైల మకరత లింగేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు.

దేవాలయ అభివృద్ధికి తమ వంతు సహకారం సంపూర్ణంగా ఉంటుందనిఅన్నారు. ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మల్లికార్జున స్వామి ఆశీస్సులు పొందాలన్నారు. దేవాలయం నిర్మించడంతోపాటు విగ్రహాలు ఏర్పాటుచేయడంతో గ్రామంలో ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో పాడిపంటలతో సుభిక్షంగా ఉంటారనిఅన్నారు. శివ మాలధారణ చేపట్టిన స్వాములు దైవకార్యానికి శ్రీకారం చుట్టడం శుభసూచకమని దాతలు ఆలయ నిర్మాణంలో పాలుపంచుకోవాలని కోరారు.

దేవాలయ నిర్మాణానికి పెద్ద 1, 1116 నగదు అందజేయడంతోస్వాములు దాతలను అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో శివ స్వాములు రాజు, మంజు, లక్ష్మణ్, పిఎన్ లక్ష్మణ్, కురుమూర్తి, వెంకటేష్, అంజి, జి వెంకటేష్, బాల శేఖర్, అంబ్రిష్, శివ, పి ఎం నరసింహ, ఊళ్లే శివ, శివశంకర్, అరవింద్, బాలస్వామి, చెన్నయ్య, ఇళ్లగవినోళ్ల రాజు ఉప్పరి రాము అంజి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply