TG | మున్సిపాలిటీ ఎన్నికల కోడ్… ప్రజావాణి రద్దు…

TG | మున్సిపాలిటీ ఎన్నికల కోడ్… ప్రజావాణి రద్దు…
TG | వనపర్తి ప్రతినిధి, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీ ఎన్నికల నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి నేడొక ప్రకటనలో తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికలు పూర్తయి, కోడ్ ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమం ఉండదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని జిల్లాలోని ప్రజలంతా గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదులు ఇచ్చేందుకు ఎవరూ రావొద్దని తెలిపారు.
