Bellampalle | నల్ల బ్యాడ్జీలు ధరించి మోటార్ సైకిళ్ళతో నిరసన ర్యాలీ..

Bellampalle | నల్ల బ్యాడ్జీలు ధరించి మోటార్ సైకిళ్ళతో నిరసన ర్యాలీ..

Bellampalle | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం బెల్లంపల్లి పట్టణం నిరసనలతో హోరెత్తింది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి పట్టణంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడుతూ గులాబీ దళం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసింది. పట్టణంలోని కన్నాల ఫై ఓవర్ మీదుగా ప్రారంభమైన ఈ ర్యాలీ టేకులబస్తీ, కన్నాల బస్తీ, మెయిన్ బజార్, కాంటా చౌరస్తా, ఏఎంసీ, కాల్ టాక్స్ మీదుగా కొనసాగింది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బైక్‌లపై తరలివచ్చి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నూనెటి సత్యనారాయణ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, నియోజకవర్గ అధికార ప్రతినిధి కొమ్మరి లక్ష్మణ్, జిల్లా బీఆర్ఎస్వీ అధ్యక్షుడు బడికల శ్రావణ్ మాట్లాడారు.

Bellampalle

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన కేసీఆర్‌పై విచారణ పేరుతో నోటీసులు జారీ చేయడం అమానుషమన్నారు. “ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల పక్షాన పోరాడుతున్న మాజీ సీఎంపై రాజకీయ కక్షతో వ్యవహరిస్తోంన్నారు. “అక్రమ కేసులు, నోటీసులతో బీఆర్ఎస్ గొంతు నొక్కలేరని, ప్రజలు కాంగ్రెస్ సర్కార్‌కు తగిన గుణపాఠం చెబుతారని” వారు హెచ్చరించారు. ఈ నిరసన ర్యాలీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాసరి శ్రీనివాస్, తాళ్లపల్లి అశోక్ గౌడ్, బత్తుల అనసూయ, మోర మోక్షానందం, ఏలూరి వెంకటేష్, అలవేన సంపత్, నాగవేణి గజేందర్, కత్తి శ్రీనివాస్, ఎల్కటూరి పోచన్న, మద్దెల గోపి, ఉమామహేశ్వర్, ఎండీ అనీఫ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply