sport | సాప్ట్ బాల్ క్రీడల్లో రాష్ట్ర స్థాయికి విద్యార్థుల ఎంపిక….

sport | సాప్ట్ బాల్ క్రీడల్లో రాష్ట్ర స్థాయికి విద్యార్థుల ఎంపిక….
sport | కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : ఈ నెల 21 నుండి 23 వ తేదీ వరకు కమ్మర్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మినీ స్టేడియం క్రీడా ప్రాంగణంలో జరిగే 69వ సాప్ట్ బాల్ అండర్ 17 బాల,బాలికల సాప్ట్ బాల్ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ కు స్థానిక పాఠశాల విద్యార్థులు భవాని, వర్షిత్ లు రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్న, పీడీ వేముల నాగభూషణంలు సంయుక్తంగా ఈ రోజు తెలియజేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులను సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్,ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్, వీడీసీ అధ్యక్షుడు కార్యవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు అభినందించారు.
