Allapalli | సంక్రాంతి వేడుకలకు వాలీబాల్ క్రీడలు ప్రారంభం

Allapalli | సంక్రాంతి వేడుకలకు వాలీబాల్ క్రీడలు ప్రారంభం
- వాలీబాల్ క్రీడలను ప్రారంభిస్తున్న సర్పంచ్ సంజీవరావు
- పాలకవర్గం ఆధ్వర్యంలోని వాలీబాల్ కబడ్డీ
Allapalli | ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : గుండాల మండల పరిధి పడుగోనిగూడెం పంచాయతీలోని సర్పంచ్ ఈసం సంజీవరావు, ఉపసర్పంచ్ జోగా రాజేష్ పాలకవర్గం ఆధ్వర్యంలో వాలీబాల్ కబడ్డీ క్రీడలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. వాలీబాల్ కబడ్డీ మొత్తం 15 టీమ్ లు పోటీలలో పాల్గోనడం జరిగిందని స్థానిక సర్పంచ్ సంజీవరావు తెలిపారు. కబడ్డీ వాలీబాల్ 2 క్రీడలకు సమానంగా ప్రథమ బహుమతులు 5016, ద్వితీయ బహుమతులు 3016 ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ పోటీలను శారీరక మానసిక ఉల్లాసం దృఢత్వం కోసం క్రీడాపోటీలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
క్రీడాలత వెలికితీసేందుకే క్రీడాపోటీలను ప్రతిఏట సంక్రాంతికి ఏర్పాటు చేయడం జరుగుతుందని గుర్తు చేశారు. వాలీబాల్ పోటీలను తిలకించేందుకు స్థానిక అభిమానులు, యువకులు భారీగా వీక్షించేందుకు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గం ఇరెం ప్రవీణ్, కొట్టెం విజయ్‌కుమార్, పెండకట్ల రోజారాణి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊకె బుచ్చయ్య, బాబురావు, జోగా రమేష్,ఈసం నరసింహారావు,కొట్టెం తిరుపతయ్య, నారాయణ, చీమల అశోక్, అథ్లెటిక్స్ సాంబశివరావు కృష్ణమూర్తి ప్రవీణ్ కుమార్ సందీప్ ఈసం రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
