పదవ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలన…

పదవ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలన…
పరీక్షకు 251 మంది విద్యార్థులు గైర్హాజర్
జిల్లా వ్యాప్తంగా 59 పరీక్షా కేంద్రాలు తనిఖీలు..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో సోమవారం నంద్యాల జిల్లాలో తెలుగు పరీక్ష ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు మధ్య పరీక్షలు సజావుగా నిర్వహించినట్లు రాష్ట్ర అబ్జర్వర్ ఎం.అనురాధ తెలిపారు. జిల్లాలో 130 పరీక్ష కేంద్రాలలో 24834 మంచి విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 23553 మంచి విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 281 మంది విద్యార్థులు గైరు హాజరైనట్లు తెలిపారు.
జిల్లాలోని రాష్ట్ర అబ్జర్వర్ తోపాటు పరీక్షల సహాయ కమిషనర్ , జిల్లా విద్యాశాఖ అధికారి, ఉప విద్యాశాఖ అధికారులు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు 59 పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అబ్జర్వర్ అనురాధ మాట్లాడుతూ పరీక్షా కేంద్రాలలో విద్యార్థులు మొదటి రోజు కాస్త గందరగోళానికి గురయ్యారు అన్నారు. వారికి నంబర్లు రూములు కేటాయించడం కాస్త కన్ఫ్యూజన్ పడటంతో వారినందరికి సర్ది చెప్పటం జరిగిందన్నారు.
విద్యార్థులకు ఏ రూంలో పరీక్ష కేంద్రం లో పరీక్ష రాయాలో నంబరు గది పరీక్ష రాసే విద్యార్థులకు చూపించి వివరాలు తెలపటం విశేషం.పరీక్షల్లో మాస్ కాఫీయింగ్ జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసా మన్నారు. జిల్లాలోని 130 పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి జిరాక్స్ సెంటర్లు లేకుండా షాపులు మూసివేసామన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేశామన్నారు. విద్యార్థులు పరీక్షాలలో నిశ్శబ్ద వాతావరణంలో పరీక్షలు రాయటం గమనించామన్నారు.

పరీక్షాలలో విద్యార్థులకు తాగునీటి వసతి వైద్య సౌకర్యం కల్పించామన్నారు. పరీక్షా కేంద్రాలలో డిపార్ట్మెంటల్ అధికారితో పాటు, చీఫ్ సూపర్డెంట్, ప్రతి ఇన్విజిలేటర్, 70 పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సిట్టింగ్ స్క్వాడ్ ఎవరి విధులు వారు నిర్వర్తించాలని సూచించారు. పరీక్షా కేంద్రంలోకి ఏ ఇన్విజిలేటర్లు సెల్ఫోన్ తీసుకువెళ్లకూడదన్నారు. ప్రశ్న పత్రాలను పోలీస్ స్టేషన్ నుంచి తెచ్చిన తర్వాత రాష్ట్రం నుంచి ఏర్పాటు చేసిన మీటింగ్ లో చెప్పిన పేపర్ కోడ్ ను మాత్రమే విద్యార్థులకు ఇవ్వాలని సూచించారు. తెలుగు పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 98.87 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు.

ప్రతి పరీక్ష కు ప్రభుత్వము సెలవు రోజులు ఉన్నాయని ఆ సెలవు రోజుల్లో ఏడాది పాటు కష్టపడి చదివిన విద్యార్థి రివిజన్ చేసుకుని మంచి మార్కులు సాధించాలని రాష్ట్ర అబ్జర్వర్ అనురాధ ఆశించారు.ప్రతి విద్యార్థి కష్టపడి చదివి మంచి విజయాన్ని సాధించాలని ఆమె ఆకాంక్షించారు. పరీక్షా కేంద్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఉపవిద్యాశాఖ అధికారులు పరిశీలించారు.
