నలిగిపోతున్న మూడో సింహం..

నలిగిపోతున్న మూడో సింహం..
వైసీపీ ప్రభుత్వంలో జీతం తప్ప అలవెన్స్ లు లేని వైనం..
24 గంటల వీధుల్లో బాధ్యతలు…
రాజకీయ నాయకులకు కాపలా?…..
హింస సంఘటనలకు మేమే… కాపలా?…
ఫ్యాక్షనిజం, నక్సలిజంపై పోరాడిన పోలీస్ వ్యవస్థ…
పదోన్నతుల కోసం చెకోర పక్షుల్లా ఎదురుచూపులు..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ఏ ప్రభుత్వము వచ్చినా ఏమున్నది గర్వకారణం.. అందరూ పోలీసు వ్యవస్థను ఉపయోగించుకోవటమే తప్ప వారికి న్యాయం చేయాలన్న ఆలోచన లేకపోవటం విశేషమని కొద్దిమంది పోలీసులు ఆవేదన వ్యక్తం చేసిన సంఘటనలు జరుగుతున్నాయి. గత వైసిపి ప్రభుత్వం లో ఐదు సంవత్సరాలు పోలీస్ వ్యవస్థను భయంకరంగా వాడుకున్నారే తప్ప వారి కి ఒక్క జీతం తప్ప ఎలాంటి అలవెన్సులు ఇవ్వకపోవడం విశేషం. 24 గంటలు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్న పోలీసు వ్యవస్థ పై ప్రత్యేక కథనం.ఓ ఇంటిలో అర్ధరాత్రి దొంగలు పడ్డారు అన్న సమాచారం 100 కాల్ ద్వారా పోలీసులకు చేరింది. వెంటనే ఉన్నతాధికారులు హడావుడిన ఫోన్ల ద్వారా విధులకు రప్పిస్తారు.. మరోచోట పట్టణంలో బాంబు పేలింది… పోలీసులు వెంటనే హాజరు కావాల్సి ఉంటుంది..
అధికారులు పోలీసులు జరుగుతున్న సంఘటనలపై టెన్షన్ టెన్షన్… ఇలా ఏ సంఘటన సమాజంలో ఏ ఆపద వచ్చినా సామాన్యుడికి మొదట గుర్తొచ్చేది పోలీస్ స్టేషన్. అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగినా, ఒక ఇంట్లో గొడవ జరిగినా, చివరకు ప్రాణాలు తీసే మర్డర్ జరిగినా.. సంఘటనా స్థలానికి అందరికంటే ముందు చేరి, అక్కడ మొట్టమొదట రక్తం వాసన చూస్తూ, శాంతిభద్రతలను కాపాడేది ఈ ఖాకీ కుటుంబ సైనికులే. అలాంటి కఠినమైన విధుల్లో మూడు దశాబ్దాల పాటు అహర్నిశలు ప్రేమించిన పోలీసులు పదోన్నతులు లేక చకోర పక్షులుగా ఎదురు చూడటం విశేషం.

రెవెన్యూ వ్యవస్థలో అలారిగా చేరిన ఉద్యోగి పదోన్నతుల ద్వారా రెవెన్యూ ఇన్స్పెక్టర్ అయినా సంఘటనలు ఉన్నయి. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో గుమస్తాగా క్లర్క్ గా చేరిన వ్యక్తి ఎంపీడీవో గా ప్రమోషన్ పొందిన సంఘటనలు ఉన్నాయి. సెకండరీ టీచర్గా ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరిన లో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గానీ స్కూల్ అసిస్టెంట్ గాను ప్రమోషన్లు పొందిన సంఘటనలు ఉన్నాయి. పోలీస్ వ్యవస్థలో కానిస్టేబుల్ గా ప్రమోషన్ పొందిన వారు ప్రతి కొన్ని సంవత్సరాలుగా ప్రమోషన్ లేక ఎదురుచూస్తున్న సంఘటనలు ఉన్నాయని బాధితులు వాపోతున్నారు రు.రిటైర్మెంట్ నాటికి కనీసం ఒక ‘స్టార్’ హోదాతో ప్రమోషన్ పొంది గౌరవప్రదంగా ఇంటికి వెళ్లాలన్న వారి ఆశలు ఇప్పుడు అడియాశలవుతున్నాయని పలువురు పోలీసులు వాపోవటం విశేషం.
సాంకేతిక టెక్నాలజీ లేని సమయంలో కేసుల చేదన…

ఒకనాడు ఎలాంటి టెక్నాలజీ లేదు.. ఎలాంటి రవాణా సౌకర్యాలు కూడా లేని రోజుల్లో కూడ ప్రజలకు అండ దండగ నిలిచిన వ్యక్తులు ఈ పోలీసులు.నేడు మొబైల్ టెక్నాలజీ, సిసి కెమెరాలు, టెక్నికల్ ఎవిడెన్స్ లాంటి సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయింది. ఆ సాంకేతిక పరిజ్ఞానంతో దొంగలను మర్డర్ చేసేవాళ్లను ఆధునిక టెక్నాలజీ ద్వారా గుర్తింపు పట్టే శక్తి వచ్చింది.దర్యాప్తును సులభతరం చేస్తున్నయి.తమ మేధస్సుతో, క్షేత్రస్థాయి నెట్‌వర్క్‌తో అత్యంత క్లిష్టమైన కేసులను ఛేదించె వారు.
ఫ్యాక్షనిజంపై ఉక్కుపాదం.. సమాచార వ్యవస్థలో కీలకం…
నంద్యాల జిల్లా అంటేనే ఒకప్పుడు ఫ్యాక్షన్ కు ప్రసిద్ధి చెందింది. జిల్లాలో ఆళ్లగడ్డ బనగానపల్లె కోయిలకుంట్ల నందికొట్కూరు ఆత్మకూరు డోన్ వంటి ఫ్యాక్షన్ ప్రాంతాలు ఉన్నాయి. జిల్లాలో ఫ్యాక్షన్ రగిలిపోతున్న ఆ రోజుల్లో, ప్రాణాలకు తెగించి గ్రామాల్లో పహారా కాసి, కత్తుల మధ్య శాంతిని నెలకొల్పిన చరిత్ర మన పోలీస్ లది..
నల్లమలలో నక్సలిజంపై పోరాటం…
నంద్యాల ప్రకాశం మహబూబ్ నగర్ జిల్లాలో సుమారుగా 4282 హెక్టార్లలో నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది.అడవికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో నక్సలిజం పేరుతో మావోలు చెలరేగిన సంఘటనలు ఉన్నాయి. జిల్లాలో ఆత్మకూరు లో బస్టాండ్ సమీపంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఒక మాజీ మంత్రిని నక్సలైట్లు కాల్చిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. నక్సలిజం కోరలు చాచిన వేళ, అడవి బాటల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన సంఘటనలు ఉన్నాయి. నక్సలైట్ల హెచ్చరికలను కూడ లెక్కచేయకుండా సామాన్యుడికి అండగా నిలిచిన సంఘటనలు జిల్లాలో కోకోల్ల లుగా ఉన్నాయి.
పిల్లల పుట్టినరోజు వేడుకలు లేవు.. జీవితమంతా విధులతోనే సతమతం…
ప్రధాన పండుగలైన దసరా దీపావళి సంక్రాంతి రంజాన్ క్రిస్మస్ వంటి పండగలను కూడా సరిగా నిర్వహించుకో లేకపోవటం విశేషం. సమాజం పండుగలు చేసుకుంటుంటే, వీరు మాత్రం రోడ్లపై బందోబస్తులో ఉండాల్సిందె. విధులలో ఒక భాగమే. కుటుంబ సమస్యల దగ్గరి నుండి కఠినమైన నేరాల వరకు అన్నింటినీ భుజానికెత్తుకున్న వీరికి, ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే రివార్డు ‘నిర్లక్ష్యం’ కాకూడదని పోలీస్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు.24 గంటలు డ్యూటీలో పోలీసులు ఉండాల్సిందే అది వారి బాధ్యత..
శిక్షణ నిలిచి.. భవిష్యత్తు అంధకారమై!..
సాధారణంగా ప్రతి ఏడాది డిసెంబరులో జరగాల్సిన కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ,, ఏ ఎస్ఐ నుంచి ఎస్ఐలకు సంబంధించిన పదోన్నతులు పదోన్నతి గత కొంత కాలంగా ఆగిపోవడం విశేషం. శిక్షణ ప్రక్రియ ఈసారి లేకపోవటం విశేషం. గత వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగా ప్రమోషన్ లు లేక పోలీసులు చాలా మంది పదవీ విరమణ పొందుతున్నరు.పదవి విరమణ పొందే సమయంలోనైనా ప్రమోషన్ వస్తుందన్న ఆశతో ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్లు లేక పోలీస్ బాధితులు ఎంతోమంది లోలోపల మదన పడుతూ ఉన్నారు.కేవలం జీతం పెరుగుదల కాదు, మా మూడు దశాబ్దాల కష్టానికి దక్కే పదోన్నతి గుర్తింపు కావాలని కోరుకుంటున్నా రు.
పోలీసులు పదవి విరమణ రోజున పదోన్నతి హోదాలో మా కుటుంబ సభ్యుల ముందు సెల్యూట్ అందుకోవాలని ఉందన్న ఆశ ప్రతి పోలీస్ అన్నలకు ఉంటుంది.. అది మా 30 ఏళ్ల కల” అని ఓ సీనియర్ ఏఎస్ఐ కళ్లమ్మట నీళ్లు పెట్టుకుని ఆవేదన వ్యక్తం చేయటం విశేషం. మూడు దశాబ్దాల పాటు ఫ్యాక్షనిజం, నక్సలిజం ఎదుర్కొని పనిచేసిన పోలీస్ లకు మానవీయ కోణంలోపదోన్నతులు కల్పించాలని కోరుతున్నారు.
