గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి…

గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి…

ఊట్కూర్, ఆంధ్రప్రభ : వార్డు సభ్యులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఊట్కూర్ ఎంపీవో బాలాజీ, సూపరిండెంట్ కొండన్న అన్నారు. సోమవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు రెండో విడత శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం రెండో విడత 11 గ్రామాల వార్డు సభ్యులకు ఈనెల 23 నుండి 27 వరకు నిర్వహిస్తుందనిఅన్నారు.

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తూ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కీలకపాత్ర వహిస్తే లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందన్నారు. వార్డు సభ్యులు తమ వార్డు పరిధిలో రోడ్లు డ్రైనేజీలు విధి దీపాలు తాగునీటి వసతి కల్పించేందుకు వేక్షించాలన్నారు. వార్డు సభ్యులకు సమస్యలను అవసరాలను గ్రామసభలు పంచాయతీ సమావేశం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలన్నారు.

గ్రామాల్లో ప్రధాన సమస్యలు గుర్తించి ప్రణాళికలు సిద్ధం చేసి పనులు చేపట్టేందుకు తీర్మానించాలన్నారు. వార్డు సభ్యులు సమస్యల పరిష్కారంతోపాటు పన్నుల వసూలు గ్రామపంచాయతీలకు వచ్చే ఆదాయ వనరుల వసూళ్లకు సహకరించాలన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధికి నాంది పథకాలు అన్నారు. అనంతరం టి ఓ టి లు తిమ్మప్ప నరసింహారెడ్డి రవికుమార్ స్వామినాథ్ వార్డు సభ్యులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు ఆయా గ్రామాల వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply