wrestling |కుస్తీ పోటీలకు సిద్దం..

wrestling |కుస్తీ పోటీలకు సిద్దం..
సూర్యాపూర్ లో 16, 17 తేదీల్లో బరిలోకి మల యోధులు
శివరాత్రి పండుగ పురస్కరించుకొని కుస్తీ పోటీలు
wrestling | కుంటాల, ఆంధ్రప్రభః ఏండ్ల నాటి ఆచారం సాంప్రదాయం పల్లె పండుగలకు పట్నం వెళ్లిన వారంతా జాతరకు ఊర్లోకి వచ్చేవాళ్లు తారు కలవడానికి కాలక్షేపానికి వేదికగా కావాలి అదే కుస్తీ పోటీల మైదానం డబ్బు చప్పుళ్ళు నడుమ వందలాది జనం ప్రేక్షకులు ఈలల మోతాలు బరిలో నిలిచిన యోధులు జఫ్ఫా చెరు పూలు కుస్తీమే సవాల్ అరుపులు మైక్ లో వ్యాఖ్యత రన్నింగ్ కామెంట్రీ మద్దతుదారుల ప్రోస్తాంతో అక్కడ అంతా కోలహాలంగా ఉంటుంది శివరాత్రి పండుగ పురస్కరించుకొని కుంటాల మండలం సూర్యాపూర్ ఓలా గ్రామాల్లో జరిగే మలయోధులకు కుస్తీ పోటీలపై ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు ప్రతిఏటా మహాశివరాత్రి పండుగ వచ్చిందంటే ప్రతి గ్రామంలో వారం రోజుల నుండి కుస్తీలో పోటీల గురించి గ్రామ కూడలల్లో చర్చిస్తారు అయితే కుస్తీ పోటీల వేళాయ
కుస్తీ పోటీలకు 57 ఏళ్ల చరిత్ర..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సూర్యాపూర్ గ్రామం కుస్తీ పోటీలకు చక్కటి వేదికగా మారింది గత 57 ఏళ్ల క్రితం గుర్రపు చౌకదారు అటవీ అధికారి ఓలా గ్రామానికి చెందిన తిప్పగజరంకు ఆలోచన తట్టి కుస్తీ పోటీలను ఏర్పాటు చేశారు అప్పటినుంచి క్రమం తప్పకుండా అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు కొనసాగుతున్నాయి గ్రామ అభివృద్ధి సమితి ఆధ్వర్యంలో రూపాయలు వెయ్యి రూపాయలతోనే పోటీలను ప్రారంభించగా ఇప్పుడు లక్ష వరకు కుస్తీ పోటీలకు పెడుతున్నారు కుస్తీ పోటీలో తలబడ్డ వారికి బహుమతులు అందజేస్తూ ప్రోత్సహిస్తుంటున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ నిజాంబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్రలోని వివిధ జిల్లాలకు చెందిన మలయోధులు కుస్తీ పోటీలకు వస్తుంటారు ఇదే స్ఫూర్తి ఓలా శివాలయా ప్రాంగణంలోని గత ఏడేళ్ల క్రితం కుస్తీ పోటీలను ప్రారంభించారు శివరాత్రి పండుగ మరుసటి రోజు ఓలా గ్రామంలో సైతం కుస్తీ పోటీలను నిర్వహించడం ఆనవాయితీ
ఆకట్టుకునేలా కుస్తీ పోటీల విజేతల విన్యాసాలు
కండబలం ఉన్న వారిదే గెలుపు ప్రకృతి వీపు భాగం పూర్తిగా నేలకు అనిచించిన వారే విజేతలుగా నిలుస్తారు ప్రత్యేకంగా ఇంత సమయం అంటు పట్టవచ్చు వివిధ దశల్లో నిర్వహించే కుస్తీ పోటీలో విజేతలుగా నిలిచిన వారు చేసే విన్యాసాలు ఆకట్టుకుంటాయి ప్రేక్షకులు మద్దతుదారులు కేరాతాలు అరుపులతో ప్రాంగణంలో హైరెత్తుతుంది విడతలవారీగా వయస్సు లతో బరిలోకి దింపుతారు 50 నుంచి మొదలు ఐదువేల వరకు నగదు బహుమతులు అందజేస్తారు పోటీలు కొనసాగిస్తారు చివరి విజేతగా ఇప్పటివరకు అధికంగా నాందేడ్ జిల్లా వాసులకే గెలుపొందారు విజేతలను సాంప్రదాయ బద్దంగా కొబ్బరికాయ అందజేసి శాలువాతో సత్కరించి నగదు అందజేస్తారు భవితరాలకు సాంప్రదాయ క్రీడ గుర్తుండేలా గ్రామస్తులందరూ ఐక్యంగా పాల్గొనడం విశేషం ఏటా సుమారుగా 200 మందికి పైగా మలయోధులు మహారాష్ట్ర నలుమూలల నుండి కుస్తీ పోటీలకు తలపడడానికి మహారాష్ట్ర వైపు నుండి వారం రోజుల ముందుగానే చేరుకుంటారు అయితే సోమవారం సూర్యాపూర్ లో కుస్తీ పోటీలు ఉండగా మంగళవారం ఓలా గ్రామంలో కుస్తీ పోటీలు నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు ఈ సందర్భంగా కుస్తీ పోటీలకు మైదానాల సైతం సిద్ధం చేశారు.
