పరిగి, ఆంధ్ర‌ప్ర‌భ : వికారాబాద్ (Vikarabad) జిల్లా పరిగి మండలం మాదారం గ్రామంలో పద్మమ్మ (36) అనే మహిళ హత్యకు గురైంది. ఊరులోని కల్లు దుకాణం ముందు సందులో మహిళ మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. మహిళ కుడి కన్ను భాగంలో రక్త గాయాలు ఉండటం గమనించి వెంటనే పోలీసుల (Police) కు సమాచారం అందించారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం (CluesTeam) ద్వారా ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. కల్లు దుకాణం నడిపిస్తున్న వ్యక్తిపై మహిళ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ (investigation) చేస్తున్నారు.

Leave a Reply