న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేయాలి..

బిక్కనూర్, ఆంధ్రప్రభ ; న్యాయవాదుల సంక్షేమానికి నిరసన కృషి చేయాలని కామారెడ్డి జిల్లా బార్అసోసియేషన్ మాజీ అధ్యక్షులు శ్రీధర్ అన్నారు.తెలంగాణ అడ్వకేట్ స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికైన జగదీశ్వరరావును కామారెడ్డి జిల్లా మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు అతిమామల శ్రీధర్ బిక్నూర్ లో ఘనంగా సన్మానించి జగదీశ్వరరావు ను అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా అతిమామల శ్రీధర్ మాట్లాడుతూ, జిల్లాలోని న్యాయవాదులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా న్యాయవాదుల సంక్షేమం, కోర్టు సదుపాయాల మెరుగుదల, మరియు వృత్తి సంబంధిత ఇబ్బందులను పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు.

రాష్ట్ర స్థాయిలో బాధ్యతలు స్వీకరించిన జగదీశ్వరరావు , న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జగదీశ్వర్ మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలియజేశారు.

Leave a Reply