Warangal | మద్యం మత్తు..

Warangal | మద్యం మత్తు..

Warangal, నర్సంపేట, ఆంధ్రప్రభ : నర్సంపేట పట్టణంలోని వరంగల్ రోడ్ లో ఉన్న వైన్ షాపు ముందు ఆదివారం రాత్రి మద్యం మత్తులో ముగ్గురు యువకులు పరస్పరం సీసాలుతో దాడి చేసుకోవడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి అయినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని వరంగల్ రోడ్డు లక్ష్మీ వైన్స్ దగ్గర సమీపంలో గల ముగ్గురు యువకులు ఆదివారం రాత్రి మద్యం సేవించారు. మద్యం మత్తు ఎక్కువ అవ్వడంతో వారి మధ్య మాట, మాట పెరిగి తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ గొడవ కాస్తా ముదిరి ఒకరి పై ఒకరు సీసాలతో దాడి చేసుకునే స్థాయికి చేరింది.

ఈ పరస్పర దాడుల్లో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరు కారు అద్దాలు పగలగొట్టడం జరిగింది. ఈ సంఘటన స్థలంలో ఉన్న వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకొని గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దాడిలో గాయపడిన ముగ్గురిలో ఒక యువకుడు తీవ్ర గాయాలతో ఉండటంతో, మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. ఈ ఘటన పై నర్సంపేట పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply