వందేమాతరం దేశభక్తిని, ఐక్యతను చాటుతోంది

జిల్లా ఎస్పీ సునీల్ షొరాన్

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : వందేమాతరం జాతీయ గీతం దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజలకు స్ఫూర్తినిచ్చిన ముఖ్యమైన పాట అని జిల్లా ఎస్పి సునీల్ షొరాన్ అన్నారు. ఈ గీతం నేటికీ 150వ వసంతం పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో వందేమాతరం గీతాలాపన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వందేమాతరం గీతం ముఖ్య ఉద్దేశంలో సిబ్బందికి వివరించారు.

దేశభక్తిని, జాతీయ స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది,నలందా స్కూల్ విద్యార్థులు అంతా ఏకమై వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ ఎం.జావళి, జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎన్ . యుగంధర్ బాబు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఏఆర్డీఎస్పీ శ్రీనివాసరావు, ఇన్‌స్పెక్ట‌ర్లు మోహన్ రెడ్డి, సూర్యమౌళి, జీవన్ బాబు, రిజర్వు ఇన్‌స్పెక్ట‌ర్లు మంజునాథ్, సురేష్ బాబు, ఆర్‌ఎస్ఐలు, డీపీఓలు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply