అకాల వర్షం.. భారీ నష్టం..

అకాల వర్షం.. భారీ నష్టం..
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : సోమవారం రాత్రి, మంగళవారం తెల్లవారు జామున బలమైన ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షం వల్ల జిల్లాలో పలు చోట్ల మొక్కజొన్న చేన్లు నేలవాలాయి. కంకి దశలో ఉన్న మొక్కజొన్న గాలులు బలంగా వీయడంతో దెబ్బతిన్నాయి. చేతికి అందివచ్చే సమయంలో వాతావరణం అనుకూలించక రైతుకు పంట నష్టపోయి ఆర్థికంగా నష్టపోతున్నారు.
మామిడి తోటల్లో మామిడి కాయలు నేలరాలాయి. ప్రభుత్వం పంటకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. తాను సాగు చేసిన 4 ఎకరాల మొక్కజొన్న వర్షం, గాలుల వల్ల నెలవాలి తీవ్రంగా నష్టం వాటిల్లిందని పెదపల్లి మండలం కొత్తపల్లి గ్రామ రైతు పల్లె మల్లేశం ఆందోళన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలి ప్రభుత్వాన్ని కోరాడు.

